



సఖీ సినిమాతో తెలుగు ఇండస్టీ అడుగుపెట్టిన మాధవన్, తర్వాత చెలి వంటి లవ్ స్టోరీ స్ లో కనిపించాడు. కమల్ హాసన్ తో స్రీన్ షేర్ చేసుకుని. దక్షిణాదినే కాకుండా బాలీవుడ్ లో కూడా సినిమాలు చేశాడు. ఒక సమయంలో మాధవన్ హాలీవుడ్ లో కూడా నటుడిగా ప్రయత్నాలు చేశాడు. ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ లో హిరోతో పాటు విలన్ వేషాలు కూడా వేస్తునారు. మాధవన్ తన అందం, నటనతో ప్రేక్షకులకు గుర్తిండి పోయే సినిమాలు చేశాడు. 50 ఏళ్లు వచ్చినా మాధవన్ అలా కనిపించరు. తన గ్లామర్‌తో ఇప్పటి హీరోలకు సైతం పోటీ ఇస్తూ మన్మధుడిగా కొనసాగుతున్నారు. కాగా అనుష్క సరసన మాధవన్ నటించిన నిశ్శబ్దం గత నెల ఓ.టీ.టీలో విడుదల అయ్యింది. ఈ సినిమాకు మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. ప్రస్తుతం ఈ నటుడు రాకెట్రీ: ద నంబీ ఎఫెక్ట్ అనే మూవీలో నటిస్తున్నారు. తాజాగా మాధవన్ తన ఇన్స్టాగ్రామ్ లో ఆసక్తికరమైన ఫోటోలు షేర్ చేసుకున్నాడు. ఎనిమిది గెటప్పుల్లో ఉన్న ఎనిమిది ఫోటోలు షేర్ చేశాడు. ఈ డిఫరెంట్ గెటప్స్ లో మాధవన్ కొత్త లుక్స్ తో అందర్ని ఆశ్చర్యపరిచాడు. ఈ పోటోల గురించి “నేను పెట్టిన ఈ ఫోటో లు నేను చెయ్యాల్సిన పాత్రలు అవి నా దగ్గరికి వచ్చి వెళ్ళాయి. అందులో మీకు ఏదీ బాగుంది చెప్పండి “ అంటూ మాధవన్ చెప్పుకొచ్చాడు.