తెలుగు, తమిళ భాషలలో తన నటనతో మాధవన్ మంచి పేరు సంపాదించుకున్నారు.ఇక ఈ మధ్యనే వచ్చిన అనుష్క నిశ్శబ్దం సినిమాతో ఆయన తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. ఇప్పుడు ఒక రీమేక్ సినిమాతో మాధవన్ మళ్ళీ మన ముందుకు వస్తున్నారు. మార అనే పేరు వస్తున్న ఈ సినిమా ట్రైలర్ మూవీ టీం ఈ రోజు సోషల్ మీడియా ద్వారా విడుదల చేసారు. ఈ ట్రైలర్ చూడటానికి చాలా కొత్తగా ఉంది. జనవరి 8 2021 లో ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కాబోతుంది.మలయాళం లో సూపర్ హిట్ అయిన చార్లీ సినిమా గురించి వినే ఉంటారు. ఈ మూవీ హిట్ అవ్వడంతో పాటు మంచి పేరు కూడా సంపాదించుకుంది.ఈ సినిమా లో దుల్కర్ సల్మాన్ , పార్వతి కలిసి నటించారు. ఇదే సినిమాని తమిళ్ లోకి మార గా మాధవన్ , శ్రద్ద శ్రీనాథ్ తో రీమేక్ చేశారు. ఈ సినిమా చాలా సార్లు పోస్టుపోన్ అయ్యాక ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా విడుదల అవ్వబోతుంది. ఈ సినిమా రీమేక్ అయినప్పటికీ పూర్తి గా సీన్ టు సీన్ కాపీ కొట్టలేదు అని మూవీ టీం చెప్తుంది. ఈ సినిమా కి కొత్త దర్శకుడు దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.