

యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాప్ హీరోగా ఇండస్ట్రీని రూల్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ 2011లో ప్రణతిను వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. వీరికి ఇద్దరు కుమారులు. అభయ్ రామ్, భార్గవ్ రామ్. ఎన్టీఆర్ తన ఇద్దరు కుమారులను, లో ప్రొఫైల్ లో ఉంచడానికి ఇష్టపడతాడు. నందమూరి అభయ్ రామ్ 2014లో జన్మించగా, భార్గవ్ రామ్ 2018లో జన్మించాడు. ఇక వీరిద్దరూ కలిసున్న ఫోటోలు సోషల్ మీడియాలో చాలా అరుదుగా దొరుకుతాయి. ఈ నేపథ్యంలో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ ఎన్టీఆర్ తన ఇద్దరు కుమారులు కలిసున్న ఫోటోను మీడియాకు షేర్ చేసాడు. ఈ ఫోటోలలో అటు అభయ్ రామ్, ఇటు భార్గవ్ రామ్ కూడా భలే క్యూట్ గా ఉన్నారు. ఈ ఇద్దరూ ఎంత క్లోజ్ అన్న విషయాన్ని కూడా ఫోటోలలో తెలియజేసారు. ఒకరినొకరు ముద్దాడుతున్న ఫోటోలు చాలా బాగున్నాయి. ఇక సినిమాల విషయానికొస్తే ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా సాగుతోంది. ఎస్.ఎస్ రాజమౌళి దర్శకుడు కాగా రామ్ చరణ్ మరో లీడ్ రోల్ పోషిస్తున్నాడు.