
మాస్ కి కేరాఫ్ అడ్రెస్ ఎన్టీఆర్ అన్న విషయం తెలిసిందే. యంగ్ ఏజ్ లోనే మాస్ ని ఎట్రాక్ట్ చేసి అంత చిన్న వయసులో ఎవరికి రాని ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నారు. ఇక ఆయన సినిమా వచిందంటే చాలు అభిమానులు పండగ చేసుకుంటారు. ప్రస్తుతం చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ చిత్రం కోసం దేశమంతా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం తర్వాత బాలివుడ్ లో కూడా ఆయనకు అభిమానులు ఏర్పడతారు అన్న విషయం తెలిసిందే. ఈ చిత్రం తర్వాత చేయబోయే కొరటాల శివ చిత్రం కూడా ప్యాన్ ఇండియా వైడ్ గా తెరకెక్కుతోంది. సినిమా అనౌన్స్ చేసినప్పుడు కూడా లాస్ట్ టైమ్ రిపేర్లు లోకల్ లోనే చేసాము ఫర్ ఎ చేంజ్ ఈ సారి బౌండరీస్ క్రాస్ చేయనున్నాం అని అన్నారు.

నిజానికి ఆర్.ఆర్.ఆర్ తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేయాలి ఎన్టీఆర్ కొన్ని కారణాల వల్ల అది పట్టాలేక్కలేదు. అయితే లైన్ లో ఉన్న వారిని కూడా పక్కన పెట్టి కోరటాలతో సినిమా అనౌన్స్ చేసారు. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఇలాంటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. సింహాద్రి తర్వాత ఆ రేంజ్ హిట్ జనతా గ్యారేజ్ అనే చెప్పాలి. అందుకనే అభిమానులు కూడా వీళ్ళ కంబోలో సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఆచార్య తర్వత అల్లు అర్జున్ తో సినిమా చేయాల్సిన కొరటాల కూడా ఎన్టీఆర్ కోసం ఆ సినిమాని హోల్డ్ లో పెట్టారు.

ఇక కొరటాల సినిమా అంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తీసిన 4 సినిమాలు బ్లాక్ బస్టర్సే. ఇక ఈ సినిమా కథ విషయానికి బౌండ్ స్క్రిప్ట్ లేనప్పటికీ వీలైనంత త్వరగా తన టీమ్ తో కలిసి పని చేస్తునట్లు సమాచారం. అలాగే ఆయన సినిమాలో హీరో కంటే ముఖ్యమైన పాత్ర ఒకటి ఉంటుంది ఆ పాత్ర సినిమాకి ప్రాణం లాంటిది. మిర్చి సినిమాలో సత్య రాజ్, శ్రీమంతుడులో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, జనతాగ్యారేజ్ లో మోహన్ లాల్, భారత అనే నేనులో శరత్ కుమార్, ఇప్పుడు చేస్తున్న అచార్యలో రామ్ చరణ్ పాత్రలు సినిమాకి వెన్నెముక లాంటివి. ఆయన ప్రతీ సినిమాలో మాదిరే ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర ఉందట. ఆ పాత్రను విజయశాంతి చేయనున్నారట. ఎన్టీఆర్, విజయశాంతి ఇద్దరూ స్క్రీన్ పై కనిపిస్తే ఖచ్చితంగా రోమాలు నిక్కబొడుచుకోవల్సిందే. మరి ఇది ఎంతవరకూ నిజమో తెలీదు గాని ఈ వార్త నిజమవ్వాలని అనుకుందాం.