The versatile @IamJagguBhai is standing first in the title #FCUK, a #Father who is #60but16! The movie prominently centred around him. #FatherChittiUmaaKaarthik
— Vamsi Kaka (@vamsikaka) December 26, 2020
Others⭐️ing @MrKarthiKKG @Ammu_Abhirami
🎬#VidyasagarRaju
Produced by @damukanuri@RanjithMovies
Jan,2021 Release. pic.twitter.com/8y52ohMfNo
రీసెంట్ గా అనౌన్స్ అయిన విభిన్నమైన చిత్రం ఎఫ్.సి.యు.కె అంటే ఫాదర్, చిట్టి, ఉమా, కార్తీక్. ఈ చిత్రంలో జగపతి బాబు లీడ్ రోల్ లో చేస్తుండగా రామ్ కార్తీక్, అమ్ము అభిరామి జంటగా కనిపించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్డేట్ ఈరోజు బయటకు వచ్చింది. జగపతి బాబు పోషించబోయే పాత్ర తాలూకు వివరాలను వెల్లడించారు. ఇందులో ఫాదర్ గా కనిపించనున్నారు జగ్గూ భాయ్. అయితే 60 ఏళ్ళు అయినా 16 ఏళ్ల కుర్రాడిలా బిహేవ్ చేసే పాత్ర అని వెల్లడించారు. ఈ చిత్రంలో ఈయనదే సెంట్రల్ పాత్ర అని తెలియజేసారు. జగపతి బాబు ఫస్ట్ లుక్ కూడా ఆసక్తికరంగా ఉంది. మందు బాటిల్ పట్టుకుని క్లాసీ లుక్ లో ఉన్నాడు. రంజిత్ మూవీస్ పతాకంపై కె.ఎల్ దామోదర్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విద్యా సాగర్ రాజు దర్శకుడు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. 2021 జనవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలన్నది ప్లాన్ గా అనుకుంటున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.