
ఒక వ్యక్తిగా తన ప్రయాణాన్ని ప్రారంభించి, శక్తిగా మారిన నటుడు చిరంజీవి. మొగల్తూరు లాంటి చిన్న గ్రామం నుండి వచ్చిన ఆయన తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సొంతం చేసుకున్నారు. కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఈ రోజు ఆయన ఈ స్థితిలో ఉన్నారు. అల్లు రామలింగయ్య గారి అమ్మాయి సురేఖని వివాహం చేసుకోవడం అయన తనయుడు అల్లు అరవింద్ గారి నిర్మాణంలో ఎన్నో హిట్ సినిమాలను చేసారు. అక్కడి నుండి మొదలైన ఆయన బంధుత్వ పరంపర ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.

ఇక ఆయన తనయుడు రామ్ చరణ్ కి అపోలో హాస్పిటల్స్ ప్రతాప్ రెడ్డి మనవరాలు ఉపాసన కామినేని తో వివాహం జరిపించారు. అప్పటివరకూ సినీ పరిశ్రమకే పరిమితమైన ఆయన బంధుత్వం వైద్య, రాజకీయ రంగాల్లో కూడా ఏర్పడింది. ఉపాసన వాళ్ళ పెద్దమ్మ సంగీత రెడ్డి భర్త చేవెళ్ళ ఎమ్.పి విశ్వేశ్వర్ రెడ్డి చిరుకి బావ వరస అవుతారు. ప్రముఖ వ్యాపారవేత్త జి.వి.కె గారితో కూడా చిరంజీవి గారికి బంధుత్వం ఏర్పడింది. విశ్వేశ్వర్ రెడ్డి తనయుడు అనిందిత్ రెడ్డికి జి.వి.కె గారి మనవరాలు శ్రియా భూపాల్ ని ఇచ్చి వివాహం చేసారు. దాంతో జి.వి.కె కూడా చిరంజీవికి బంధువైపోయారు. అలాగే టి. సుబ్బిరామిరెడ్డి గారు కూడా చిరంజీవికి బంధువు అవుతారు. అనిందిత్ కి సుబ్బిరామిరెడ్డి తాత వరస అవుతారు. ఇలా ఆయన తన చుట్టూ ఒక సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నారు.

ప్రస్తుతం ఇండస్ట్రీలో దాసరి నారాయణ రావు గారి తర్వాత ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు అనే ప్రశ్నకు సమాధానంగా మారారు చిరు. ఎవరికి ఎలాంటి సహాయం అయిన చేసిపెడుతూ, అందరికి అండగా నిలుస్తున్నారు. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఆహ్వానించిన సినిమా ఫంక్షన్లకి వెళ్ళి ఆ టీమ్ ని ప్రోత్సహిస్తున్నారు. దాసరి గారి తర్వాత ఆయన స్థానాన్ని చిరంజీవి గారు భర్తీ చేస్తే బాగుంటుందని ఇండస్ట్రీ పెద్దలు కూడా అనుకుంటున్నారు.