
ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పండగ రానే వచ్చింది. ఆ పండగేంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెండితెరపై కనిపించనున్నారు. ఇప్పటికే బుకింగ్స్ ఫుల్ అయిపోయాయి. కొన్ని చోట్ల ఇప్పటి నుండే బ్లాక్ లో టికెట్స్ కూడా అమ్ముతున్నారు. ఎంత గ్యాప్ వచ్చినా పవర్ స్టార్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు అనడానికి ఇదే నిదర్శనం.

బాలివుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ చిత్రానికి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కినట్లు తెలిసిందే. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఎక్కువ సేపు ఉండరూ అని టాక్ వస్తోంది. సినిమా కథ ముఖ్యంగా ముగ్గురు అమ్మాయిల చుట్టూ నడుస్తుంది. పవన్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని మాతృకకి చిన్న చిన్న మార్పులు చేసి తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 9న బ్రహ్మాండంగా విడుదలవుతోంది.
చాలా కాలం తరువాత @PawanKalyan ని వెండితెర మీద చూడటానికి మీలాగే నేనుకూడా ఎదురుచూస్తున్నాను. అమ్మ , కుటుంబ సభ్యులతో రేపు సాయంత్రం థియేటర్ లో #VakeelSaab చూస్తున్నాను.Can't wait to share my response of the film with you all. Stay tuned :) pic.twitter.com/eRyVbsMke0
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 8, 2021
ఎంత తమ్ముడైన పవన్ సినిమా చూడాలని చిరుకి కూడా ఉంటుంది కదా అందుకే ఆయన ట్విటర్ వేదికగా ఒక ఫోటో పోస్ట్ చేశారు. అది చిరు పవన్ ని స్టైల్ చేస్తున్న ఫోటో దాన్ని షేర్ చేస్తూ “చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ ని వెండితెర మీద చూడటానికి మీలాగే నేను కూడా ఎదురు చూస్తున్నాను, అమ్మ మరియు కుటుంబ సభ్యులతో రేపు సాయంత్రం థియేటర్ లో వకీల్ సాబ్ చూస్తున్నాను. ఆ సినిమా రేస్పాన్స్ ని మీ అందరితో షేర్ చేసుకోవటానికి ఆగలేకపోతున్నాను” అని ట్వీట్ చేసారు. అంటే రేపు మెగాస్టార్ కూడా సినిమా చూస్తున్నారు అన్నమాట.