
చిరంజీవి అంటే క్రమశిక్షణకు మారు పేరు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి ఇండస్ట్రీలో నిలదొక్కుకుని ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. షూటింగ్ లో ఎక్కువగా ఎవరితో మాట్లాడకుండా తన పని తాను చేసుకుంటూ వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి అయ్యేలా తన వంతు కృషి చేస్తారు మెగాస్టార్. చాలా సందర్భాల్లోనూ ఈ విషయాన్ని ఆయన ప్రస్తావించారు కూడా. షూటింగ్ ఎంత త్వరగా కంప్లీట్ అయితే నిర్మాతకి అంత మేలు చేసిన వాళ్ళం అవుతామని.

రాజకీయాల్లోకి వెళ్ళక ముందు ఆయన ఒకదాని తర్వాత మరొకటి వరసగా గ్యాప్ లేకుండా సినిమాలు చేసేవారు. రాజకీయాలకు స్వస్తి చెప్పి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన చేసిన రెండు సినిమాలు కొద్దిగా ఆలస్యమయ్యాయి. ఇవి రెండూ ఆయన తనయుడు రామ్ చరణ్ నిర్మించిన సినిమాలే. షూటింగ్ లేటవ్వడం వల్ల రామ్ చరణ్ మీద అదనపు భారం పడి ఉండవచ్చు. ఈ విషయమై ‘ఆచార్య’ సినిమా మొదలుపెట్టినప్పుడు కొరటాల శివతో ఇదే విషయాన్ని ఆయన చెప్పి వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేయమని ఆయనకు కండీషన్ పెట్టారట. మామూలుగా కొరటాల శివ కూడా ఫాస్ట్ గానే షూటింగ్ పూర్తి చేస్తారు. ఎన్.టీ.ఆర్ తో తెరకెక్కించిన ‘జనతా గ్యారేజ్’ ను ఆయన 6 నెలల్లో పూర్తి చేసారు.

అయితే ‘ఆచార్య’ సినిమాను కూడా రామ్ చరణే నిర్మిస్తుండడం, మునుపటి సినిమాలకు అయిన అదనపు ఖర్చు ఈ సినిమాకి కాకూడనే ఉద్దేశంతో శివకు ఈ కండీషన్ పెట్టారని చాలా మంది అనుకున్నారు. కానీ షూటింగ్ కి లాక్డౌన్ కారణంగా బ్రేక్ పడడం, అన్ లాక్ అయిన తర్వత చిరంజీవి కాస్త ఆగి షూటింగ్ ప్రారంభించడం మొత్తానికి షూటింగ్ పూర్తవ్వడానికి చాలా టైమే పట్టింది. ఆచార్య తర్వాత ఆయన చేస్తున్న లుసిఫార్ రిమేక్ సినిమాకి చరణ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అసలు నిర్మాత చరణ్ కాదు కాబట్టి ఈ సినిమాకు అలాంటి కండీషన్లు ఉండవు అని కొందరు గుసగుసలాడుకుంటున్నారు. అయితే కొరటాల శివకు పెట్టిన కండీషన్ ఈ సినిమా దర్శకుడైన మోహన్ రాజా కు కూడా వర్తిస్తుందో లేదో వేచి చూడాలి మరి.