

యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ గతేడాది ‘రాక్షసుడు’ చిత్రంతో సూపర్ డూపర్ హిట్ ను అందుకున్నాడు. ఇక ఈ ఏడాది ‘అల్లుడు అదుర్స్’ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ‘కందిరీగ’ చిత్రంతో డెబ్యూ చేసిన సంతోష్ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకుడు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్లుగా నభ నటేష్, అను ఇమ్మానుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సోను సూద్, ప్రకాష్ రాజ్ లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం త్వరలోనే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో బెల్లంకొండ శ్రీనివాస్ చాలా యాక్టివ్ గా ఉంటున్నాడు. తన లేటెస్ట్ లుక్ తో బెల్లంకొండ అందరినీ మెస్మరైజ్ చేస్తున్నాడు. ముఖ్యంగా కోర మీసాలతో బెల్లంబాబు లుక్ అదిరిపోయిందని చెప్పాలి. ఇక్కడ పోస్ట్ చేసిన ఫోటోనే తీసుకుంటే బెల్లంకొండ స్టన్నింగ్ గా ఉన్నాడు. ‘అల్లుడు అదుర్స్’ తర్వాత మరో రెండు చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి. త్వరలోనే వాటిని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.