
నేడు రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సెలబ్రిటీల దగ్గర నుండి సామన్యుల వరకూ తమకు తెలిసిన వారికి అలాగే ముస్లింలు అందరికీ ‘ఈద్ ముబారక్’ అంటూ తమ వాత్సల్యాన్ని చూపిస్తున్నారు. సోషల్ మీడియా సైతం ఈద్ ముబారక్ హ్యాష్ ట్యాగ్ లతో నిండిపోతోంది. సినీ నటులు, దర్శకులు కూడా తమ అభిమానులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సినీ నటుడు, రాజకీయ నాయకుడు నందమూరి బాలకృష్ణ గారు కూడా ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసారు.
Let us face these challenging times together and look forward for a period of good health, happiness and peace. Eid Mubarak!
Posted by Nandamuri Balakrishna on Thursday, May 13, 2021
“అందరికీ నమస్కారం ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ పవిత్ర పర్వదిన శుభాకాంక్షలు. త్యాగానికి, సేవానిరతికి మారుపేరు రంజాన్ పవిత్ర మాసం. ఎంతో భక్తి శ్రద్ధలతో కఠిన ఉపవాస దీక్ష ఉంటూ దైవాన్ని కొలవడం ఆదర్శప్రాయం. అల్లాహ్ కృపా కటాక్షాలతో ఈ రంజాన్ పర్వదినం మీ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, అందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని సమసమాన వాళి సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ బాలకృష్ణ” అంటూ ఒక వీడియోని పోస్ట్ చేసారు.

ఈ వీడియో ఇంటర్నెట్ లో తెగ హల్చల్ చేస్తోంది. ఇక ప్రస్తుతం ఆయన బోయపాటి శీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్లుగా ప్రగ్యా జైస్వాల్, పూర్ణాలు నటిస్తుండగా మీనా ఒక ముఖ్యపాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని ఈ వేసవికే విడుదల చేయాలనుకున్నా కరోన కారణంగా వీలుపడలేదు. ఇక రీసెంట్ గా విడుదల చేసిన టీజర్ ఇప్పటి వరకూ ఉన్న రికార్డులను తిరగరాస్తోంది. మరి విడుదలైన తరవాత సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.