Actor, #MAA president Dr @ItsActorNaresh met the family of artist late.Shri#NarsingYadav and expressed his deep condolences. Assured the family for future support in all aspects. pic.twitter.com/c03fOYE8RY
— BARaju (@baraju_SuperHit) January 12, 2021
ప్రముఖ నటుడు, మా అసోసియేషన్ ప్రెసిడెంట్ నరేష్ ఈరోజు నర్సింగ్ యాదవ్ కుటుంబాన్ని పరామర్శించారు. టాలీవుడ్ లో దాదాపు మూడు వందలకు పైగా సినిమాల్లో నటించిన నర్సింగ్ యాదవ్ డిసెంబర్ 31న తుది శ్వాస విడిచిన విషయం తెల్సిందే. హార్ట్ అటాక్ కారణంగా ఆయన కన్నుమూశారు. వరసగా రెండు సార్లు గుండె నొప్పి రావడంతో వైద్యులు కూడా ఏం చేయలేకపోయారు. సినిమాల్లో చాలా బిజీగా గడిపిన నర్సింగ్ యాదవ్ తన ఆరోగ్యాన్ని సరిగా చూసుకోలేకపోయారని ఆయన భార్య అన్నారు. నర్సింగ్ యాదవ్ సరైన తిండి, నిద్ర కూడా లేకుండా సినిమాల్లో నటించారని ఆమె తెలిపారు. అటు కామెడీ, ఇటు విలనిజం పాత్రలను అలవోకగా చేసుకుంటూ వెళ్లిపోయారు నర్సింగ్ యాదవ్. తన లైఫ్ స్టైల్ ను మార్చుకుందాం అనుకునే లోపే ఇలా జరిగిందని ఆమె వాపోయారు. ఇక నరేష్ ఈరోజు నర్సింగ్ యాదవ్ కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు. కచ్చితంగా వారి కుటుంబాన్ని మా అసోసియేషన్ ఆదుకుంటుందని హామీ ఇచ్చారు నరేష్.