వైరల్ అవుతున్న అల్లు అర్జున్ వీడియో..!

కరోన వల్ల మరణాలు ఎక్కువైపోయాయి. ఇటీవలే ప్రముఖ పాత్రికేయుడు తుమ్మల నరసింహ రెడ్డి కరోన కారణంగా మరణించిన విషయం తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా కరోన భారిన పడ్డారు. కంగారు పడాల్సిందేమీ లేదని ఆయన చెప్పినా ఎప్పుడు ఏం జరుగుతుందో అని ఆయన అభిమానులు భయపడుతున్నారు. స్టైలిష్ స్టార్ కి సైతం ఈ మహమ్మారి సోకిన విషయం తెలిసిందే. ఆయన పరిస్థితి ఎలా ఉంది అని అభిమానులు ఆందోళన పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ట్విటర్ వేదికగా ఒక వీడియోని పోస్ట్ చేసారు. ఆ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.

అయితే కరోన కారణంగా 15 రోజుల పాటు క్వారంటైన్ లో ఉన్న ఆయన పిల్లలకు దూరంగా ఉన్నారు. ఇన్ని రోజుల ఎదురు చూపుల్ని ఒక్కసారిగా చూపించేశారు. పిల్లల దగ్గరకి వెళ్ళగానే వాలు కూడా ఆయన్ను వాటేసుకుని తమ ప్రేమను చూపించారు. అల్లు అర్జున్ కొడుకు అయితే ఆయన మీద పడి ఆయన పైకి లేవకుండా వాటేసుకున్నాడు. కూతురు కూడా ఆయన్ను వాటేసుకుని కేరింతలు కొట్టింది. అయితే ఆయన ఇదంతా చేసింది కరోన నెగిటివ్ అని తేలిన తర్వాతే.

ఎంత స్టార్ అయినా ఆయన కూడా పిల్లలకు తండ్రే కదా ఇన్ని రోజులు వాళ్ళని కలవకుండా ఉండటం అంటే మాటలా మరి. తల్లిదండ్రులు అంత కష్టపడేది ఆరి భవిష్యత్తు కోసమే అందుకే వారిని చూడగానే బన్ని కూడా ఉద్వేగానికి లోనయ్యారు. ఈ వీడియోకి ఆయన అభిమానులతో పాటు నెటిజెన్లు కూడా పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. కన్నా ప్రేమ అలానే ఉంటుంది మరి. ఇక ఆయన కోలుకోవడంతో ఆయన అభిమానుల ఆనందానికి అవధులు లేవు. ఆయన కూడా తాను త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన అందరికీ ధన్యవాదాలు తెలియచేసారు.

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.