13 ఏళ్ల తర్వాత ఆ సినిమాని చూశాడంట..!

తమ అభిమాన నటుల పర్సనల్ విషయాలు తెలుసుకోవాలని అభిమానులు తెగ ఆరాట పడుతుంటారు. వాళ్ళ గురించి ఏ చిన్న సమాచారం దొరికినా చాలు తెగ ఆనంద పడిపోతుంటారు. ఈ కరోన కాలంలో చాలామంది సెలబ్రిటీలు కరోన భారిన పడి క్వారంటైన్ లో ఉండాల్సిన పరిస్థితి వచ్చిన విషయం తెలిసిందే. టాలివుడ్, కోలివుడ్ అనే తేడా లేకుండా దాదాపు చాలా మంది నటులు కోవిడ్ భారిన పడ్డారు. మెగా హీరోలు సైతం ఇందుకు మినహాయింపు కాదు. ఒకొక్కరిగా మెగా హీరోలు ఈ మహమ్మారి భారిన పడ్డారు. దాంతో 15 రోజులు ఇంటికే పరిమితం అవ్వాల్సి వచ్చింది.

ఒకరి తర్వాత ఒకరు అన్నట్లుగా ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వంతు వచ్చింది. ఇటీవలే ఆయన కోవిడ్-19 పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని తేలిన విషయం తెలిసిందే. ఆయన క్వారంటైన్ లో రెస్ట్ తీసుకుంటూ డాక్టర్ల సూచనలు పాటిస్తూ వీలైనంత త్వరగా కోలుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఖాళి సమయం ఎక్కువ ఉండటంతో సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక పోస్ట్ ను ఆయన పెడుతున్నారు. మొన్న తన అభిమాని డిజైన్ చేసిన ఒక పోస్టర్ ను షేర్ చేసారు.

క్వారంటైన్ లో ఆయన సినిమాలు కూడా బాగానే చూస్తునట్టు ఉన్నారు. మొదటగా ఆయనకు బ్లాక్ బస్టర్ ను అందించిన చిత్రం ఆర్య. ఆ సినిమా వల్లే బన్నికి యూత్ లో ఫాలోయింగ్ పెరిగింది. ఈ సినిమాలోని ‘ఫీల్ మై లవ్’ పాట క్లిప్ ని పోస్ట్ చేస్తూ “13 ఏళ్ల తర్వాత సినిమాని చూస్తున్నా ప్రతీ షాట్ నన్ను తిరిగి ఆ రోజులకి తీసుకుని వెళ్ళింది” అని అన్నారు. అంటే ఇన్ని సంవత్సరాల్లో ఆర్య సినిమాని ఆయన చూడకపోవటం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. ఏది ఏమైనా బన్నికి కరోన వల్ల ఆర్య సినిమా మళ్ళీ చూసే అవకాశం వచ్చింది.

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.