టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ స్టార్స్ లో అల్లు అర్జున్ ఒకరు. అయితే టాలీవుడ్ లో అగ్ర నిర్మాతగా రాణిస్తున్న అల్లు అరవింద్ ఫ్యామిలీ గురించి అందరికీ తెలిసిందే. ఈయనకు అల్లు అర్జున్, అల్లు శిరీష్ లతో పాటు మరో కొడుకు ఉన్నాడని చాలా మందికి తెలియదు. ఆయనే అల్లు వెంకటేష్ ఈ స్టైలీష్ స్టార్ సోదరడు అల్లు బాబీ పుట్టిన రోజు అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ పుట్టినరోజు సందర్భంగా స్లైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఎమోషనల్ ట్వీట్ చేశాడు. “పుట్టిన రోజు శుభాకాంక్షలు బాబీ వచ్చే ఏడాది నీ జీవితంలో మరిచిపోలేని సంవత్సరం కావాలని కోరుకుంటున్నాను. నువ్వు నా ప్రతీ సినిమాతో పాటు, నా జీవితానికి మూల స్థంభంలాగా నిలిచావు. ఈ ప్రత్యేకమైన రోజును ఎంజాయ్ చేయి” అంటూ ట్విట్టర్ వేదికగా విష్ చేశాడు. అంతే కాకుండా టాలీవుడ్ లోనీ పలువురు సెలబ్రిటీలు అల్లు బాబీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే అల్లు అర్జున్ తన సొదరుడు అల్లు బాబీకి శుభాకాంక్షలు తెలుపుతూ ముగ్గురు సొదరులు కలిసిన ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఈ ఫోటోలో ముగ్గరు అన్నదమ్ములు ముగ్గురు మనగాళ్ళ లాగా అదిరిపోయో లుక్స్ లో ఉన్నారు.