
టాలివుడ్ లో అగ్ర హీరోలందరూ తాము చేయబోయే సినిమాలను వరసగా లైన్ లో పెడుతున్నారు. ప్రభాస్ చేతిలో ప్రస్తుతం 3 సినిమాలు ఉన్నాయి. ఎన్టీఅర్ ప్రస్తతం చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ కాకుండా త్రివిక్రమ్ తో ఒక సినిమాని, ప్రశాంత్ నీల్ తో ఒక సినిమాని మైత్రి మూవీ మేకర్స్ లో ఒక సినిమాని చేయనున్నారు. మైత్రిలో చేయబోయే సినిమాకి బుచ్చిబాబు దర్శకుడు అని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే రామ్ చరణ్, మహేష్ బాబులు చేయబోయే తదుపరి సినిమాలు కూడా అనౌన్స్ చేసేసారు. ఇక మిగిలింది అల్లు అర్జున్ మాత్రమే అల వైకుంఠపురములో తర్వాత ఆయన పుష్ప చిత్రాన్ని చేస్తున్నాడు.

పుష్ప సినిమాని ఆగస్ట్ 13న విడుదల చేయనున్నట్లు ప్రకటించేశారు నిర్మాతలు. అయితే ఆయన చేయబోయే తదుపరి సినిమాల గురించి బయట రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. ఆచార్య తర్వత కొరటాల శివ రామ్ చరణ్ తో సినిమా చేయాలి కాని అనుకోని విధంగా క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో సినిమా చేయనున్నట్లు అధికారికంగా ప్రకటితమైంది. అయితే ఈ గ్యాప్ లో కొరటాల సివి అల్లు అర్జున్ తో సినిమా చేయనున్నట్లు సమాచారం. అలాగే ప్రశాంత్ నీల్ తో ఒక సినిమాని చేస్తారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఒక వేల ఇదే నిజమైతే మరి ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ ల సినిమా మళ్ళీ పోస్ట్ పొం అయ్యే చాన్స్ ఉంది.

అయితే బన్ని కూడా తదుపరి సినిమాలను లైన్ లో పెట్టినట్లే. ఇదిలా ఉంటే అప్పట్లో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ అనే సినిమా చేయనున్నట్లు ప్రటించారు. నానితో ఎం.సి.ఎ చిత్రాన్ని తీసి హిట్ కొట్టాడు వేణు శ్రీరామ్ అప్పుడే వీళ్ళ సినిమాని అధికారికంగా ప్రకటించారు. అయితే అల్లు అర్జున్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా తర్వాత త్రివిక్రమ్ తో సినిమాని చేసాడు, ఆ తర్వాత పుష్ప సినిమా చేస్తున్నాడు. దీని తర్వత కొరటాలతో సినిమా అంటున్నారు మరి ఐకాన్ ఉంటుందా ఎద అనేది ఇప్పుడు అసలు ప్రశ్నగా మారింది. ఈ విషయాన్నే దర్శకుడ్ని అడగ్గా ఆయన ఈ సినిమా ఆగిపోలేదని ఖచ్చితంగా ఉంటుంది కాని బన్ని డేట్స్ కారణంగా పాట్టాలెక్కడం లేట్ అవుతుందని వివరించారు.