యువ సామ్రాట్ నాగార్జున

పరిచయం

టాలీవుడ్ కింగ్, అరడుగుల అందగాడు, అమ్మాయిలు మనసు పడే మన్మధుడు,  ఎప్పటికప్పుడు వయస్సు తో సంబంధం లేకుండా వైవిధ్య భరితమైన కొత్త రకమైన సినిమాలతో ఎక్స్ పెరిమెంట్స్ చేసే గట్స్ ఉన్న నటుడు, యువ హిరోలతో పోటీ పడి సినిమాలు చేసే గ్రీకువీరుడు, అమ్మాయిల కలల రాకుమారుడు, అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, తెలుగు సినిమాలో తన అందంతో, అభినయంతో, ప్రత్యేకమైన స్టైల్ తో తనకంటూ ఒక పేజీ క్రియోట్ చేసి తన సినిమాలతో నూతన అక్షరాలు రచించి, రోమాన్స్, యాక్షన్, థ్రిల్లర్, ఫ్యామీలీ ఇలా జోనర్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసి, ఎంతో మంది స్టార్ డైరెక్టర్స్ ని తెలుగుకి తీసుకొచ్చి, టాలివుడ్ ని ఏలిన యువ సామ్రాట్ అక్కినేని నాగర్జున.

వ్యక్తిగత జీవితం


1959 సంవత్సరం ఆగస్ట్ 29న మద్రాస్ లో అక్కినేని నాగేశ్వరరావు, అన్నపూర్ణమ్మ దంపతులకు జన్మించాడు అక్కినేని నాగర్జున. నాగర్జునకి ఒక అన్నయ్య, ముగ్గురు అక్కలు ఉన్నారు. అన్నయ్య అక్కినేని వెంకట్, అక్కలు సరోజ, సత్యవతి, సుశీల. సత్యవతి గారి కుమారుడు సుమంత్, నాగ సుశీల కుమారుడు సుషాంత్ ఇద్దరూ హీరోలుగా రాణిస్తున్నారు. నాగర్జున ప్రాథమిక విద్యాభ్యాసం హైదరాబాద్ లో జరిగింది. ఆరవ తరగతి నుండి ఇంటర్ వరకూ లిటిల్ ఫ్లవర్ స్కూల్ లో చదివారు. మద్రాస్ లో మెకానికల్ ఇంజనీరింగ్ చేసి  అమెరికా వెళ్ళాడు. ఫిబ్రవరి 18 1984వ సంవత్సరంలో నాగర్జున వివాహం జరిగింది.

ప్రొడ్యూసర్ దగ్గుబాటి రామానాయుడు, అక్కినేని నాగేశ్వర రావు గార్ల స్నేహంతో ఈ వివాహాం జరిగింది. దగ్గుబాటి రామానాయుడు కుమార్తె లక్ష్మీ దగ్గుబాటిని అక్కినేని నాగర్జున వివాహం చేసుకున్నారు.  లక్ష్మీ దగ్గుబాటి  హిరో విక్టరీ వెంకటేష్  మరియు ప్రొడ్యుసర్ సురేష్ బాబులకు సోదరి. నాగర్జున, లక్ష్మీ దంపతులకు 1986లో అక్కినేని నాగ చైతన్య జన్మించాడు. తర్వాత కొన్ని కారాణాల వల్ల ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ‘శివ’ సినిమా తర్వాత ఆ చిత్రంలో తనకు జోడిగా నటించిన అమలను ఆయన ప్రేమించి 1992లో వివాహాం చేసుకున్నారు. నాగర్జున, అమల దంపతులకు 1994 లో అఖిల్ జన్మించాడు.

సినీ ప్రస్థానం

అక్కినేని నాగర్జున బాల నటుడిగా 1967వ సంవత్సరంలో ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించిన ‘సుడిగుండాలు’ చిత్రంలో మొదటి సారిగా తెర మీద కనపడ్డారు. తర్వాత ‘వెలుగు నీడలు’ చిత్రంలో కూడా బాల నటుడి గా నటించాడు నాగర్జున. ఈ రెండు చిత్రాల్లో అక్కినేని నాగేశ్వర రావు గారే హిరోగా నటించారు.

మెదటి సినిమా

తెలుగు సినీ చరిత్రలో మెదటి సినిమాకి ఏ హిరోకి లేని అభిమానులు నాగర్జున గారి మొదటి సినిమా ‘విక్రమ్’ కి ఉన్నారు. అభిమానులు పెద్ద ఎత్తున అభిమాన సంఘాలు స్థాపించారు. ఆ సమయంలో ఆయనకు దాదపుగా రెండు వేలకు పైగా అభిమాన సంఘాలు ఉన్నాయి. నాగర్జున హిరోగా చేసిన తొలి చిత్రం ‘విక్రమ్’. ‘విక్రమ్’ సినిమా మే 23, 1986 సంవత్సరంలో విడుదలైంది. విడుదలై యావరేజ్ టాక్ తో కలెక్షన్స్ వర్షం కురిపించింది. తెలుగు రాష్టాల్లో అభిమానులు విక్రమ్ సినిమాకి సంబరాలతో హంగామా చేసారు. విశాఖలో కమల్ థియోటర్ లో, ఉత్తరాంధ్ర జిల్లా శ్రీకాకుళం, థియోటర్స్ లో, శ్రీ రామచంద్ర థియోటర్, తాడేపల్లి గూడెం రెలంగి చిత్ర మందిర్ థియోటర్, ఇంకా చాలా థియోటర్స్ లో కలెక్షన్స్ వర్షం కురిపించింది. ఈ సినిమా తర్వాత “నిన్న అక్కినేని యుగం నేడు నాగర్జున శకం” అంటూ అభిమానులు  అక్కినేని వారి మీద తమ అభిమానం చూపించారు. విక్రమ్ సినిమాలో నాగర్జునకి జోడిగా శోభన నటించారు ఈ చిత్రానికి వి.మధుసుధన్ రావు దర్శకత్వం వహించగా అన్నపూర్ణ స్టూడియో పై అక్కినేని వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం హిందీలో వచ్చిన ‘హిరో’ సినిమాకి రీమెక్ సినిమా.

దర్శక బ్రహ్మ దర్శకత్వంలో

‘విక్రమ్’ సినిమా తర్వాత  కెప్టెన్ నాగార్జున, అరణ్యకాండ సినిమాలు చేశాడు. అవి బాక్స్ ఆఫిస్ వద్ద ఆశించినంత విజాయాన్ని అందుకోలేకపోయాయి. తర్వాత దాసరి గారి దర్శకత్వంలో ‘మజ్ను’  సినిమా చేశాడు నాగర్జున. అప్పటికే స్టార్ డైరెక్టర్ అయిన దర్శకుడు దాసరి నారాయణరావు గారు ‘మజ్ను’ సినిమాను నాగర్జునతో తీసాడు. ఈ సినిమాలో నాగర్జునకి జోడిగా రంజని నటించింది. 1987 జనవరి 14 న విడుదలైన ఈ సినిమా డీసెంట్ టాక్ తో విజయం సంపాదించింది. కలెక్షన్స్ పరంగా నిరుత్సాహపరిచినా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అక్కినేని నాగర్జున నటనకు మంచి మార్కులు పడ్డాయి. లవ్ ట్రాజెడీ  అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా లోని “ఇది తొలి రాత్రి కదలని రాత్రి” సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. ఇప్పటికి ఈ సాంగ్ ను హర్ట్ బ్రేక్ అయిన ప్రేమికులు పాడుకుంటునే ఉన్నారు.

క్లాస్ అండ్ కమర్షియల్

నాగర్జున సినిమాలు పుల్ మీల్స్ లా ఉంటాయి. మొదట పప్పు వడ్డించి, వెంటనే నాన్ వెజ్ వడ్డిస్తుంటాడు. ‘సంకీర్తన’ అనే క్లాస్ సినిమాలో నటించిన తర్వాత వెంటనే ‘కలెక్టర్ గారి అబ్బాయి’ సినిమాతో కమర్షియల్ హంగులతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇలా సినిమా సినిమాకి వెరియేషన్ చాలా తక్కువ మంది సినిమాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఆ వరుసలో నాగర్జున ముందు ఉంటాడు. ‘సంకీర్తన’ క్లాసికల్ సినిమా. నాగర్జున, రమ్యకృష్ణ జంటగా నటించిన ఈ సినిమాకి కొణార్క్ మూవీ క్రియోషన్స్ బ్యానర్ పై గీతాకృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకి ఇళయరాజా సంగీతం అందిచండం విశేషం. ఆ చిత్రం తర్వాత  కలెక్టర్ గారి అబ్బాయి సినిమాలో నటించాడు. ఈ సినిమా  అన్ని కమర్షియల్ హంగులతో వుంటుంది. ఈ సినిమాలో నాగర్జునతో పాటు అక్కినేని నాగేశ్వర రావు కూడా నటించారు. నాగర్జునకి జోడిగా రంజని నటించింది. ఈ సినిమాకి మాస్ డైరెక్టర్ బి.గోపాల్ దర్శకత్వం వహించగా లెజెండ్రీ రచయిత గణేష్ పాత్రో రచన చేశాడు. ఈ సినిమా అన్నపూర్ణ స్టూడియోస్ పై హిరో సుమంత్ ఫాదర్  సురెంద్ర యార్లగడ్డ నిర్మించారు.

ఫ్యామిలీ హిరో గా

అగ్నిపుత్రుడు, కిరాయి దాదా, అఖరి పోరాటం లాంటి మాస్ సినిమాలు చేసినా అవి అనుకున్నంత హిట్ అవ్వలేదు. తర్వాత చినబాబు, మురళీ కృష్ణుడు, జానకి రాముడు సినిమాలతో ఫ్యామిలి ఆడియెన్స్ కి దగ్గరయ్యాడు. మంచి  లవ్ స్టోరీస్, ఫ్యామిలీ స్టోరిస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మంచి ఎపిక్ లవ్ స్టోరిగా తెరకెక్కిన జానకి రాముడు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రేక్షకులు జానకి రాముడు సినిమాని సుపర్ డూపర్ హిట్ చేశారు. థియోటర్స్ లో కలెక్షన్ ల వర్షం కురిపించింది. ఈ సినిమా పాటలు ఆంధ్ర రాష్ట్ర మంతటా మారుమోగిపోయాయి. ఈ సినిమా పాటలు విని మ్యూజిక్ లవర్స్ పిచ్చెక్కి పోయారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా కంటే సినిమా పాటలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఈ సినిమాకి కె. రాఘవేంద్ర రావు గారు దర్శకత్వం వహించగా నాగర్జునకు జోడిగా విజయశాంతి, జీవిత రాజశేఖర్ నటించారు. ఈ సినిమాకి శివశక్తి దత్త, విజయేంద్ర ప్రసాద్ లు కధను అందించారు. ఈ సినిమాకి కె.వి మహదేవన్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని తమిళంలో ‘ఇదయ్ దేవతయి’ పేరుతో డబ్ చేశారు. ఈ సినిమాలోని “నా గుండె శృతి లోనా” పాట ఎవర్ గ్రీన్ సాంగ్ గా నిలించింది. ఆ తర్వాత నాగర్జున నుండి విజయ్, విక్కి దాదా సినిమాలు వచ్చాయి.

కొదండ రామిరెడ్డి  కాంబినేషన్ లో

కమర్షయల్ డాషింగ్ డైరెక్టర్ కొదండ రామిరెడ్డి, యువ సామ్రాట్ అక్కినేని నాగర్జున కాంబినేషన్ లో ఆరు చిత్రాలు వచ్చాయి. కొందడ రామిరెడ్డి సినిమాల్లో నటించాక నాగర్జున కామిడి టైమింగ్ మారిపోయింది. నాగర్జున కామెడీ సీన్స్ పండించడంలో దిట్ట అయిపోయాడు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా  ‘కిరాయి దాదా’. హిందీ చిత్రం ‘జాల్’ కు రీమేక్. ఈ చిత్రం బాక్స్ ఆఫిస్ బద్దలు కొడుతూ సూపర్ హిట్ గా నిలించింది. తర్వాత విక్కిదాద, ఇద్దరూ ఇద్దరే, ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, అల్లరి అల్లుడు, రాముడొచ్చాడు సినిమాలు వచ్చాయి. అల్లరి అల్లుడు, రాముడొచ్చాడు చిత్రాలు నాగర్జున కెరీర్ లో మంచి కామెడీ యాక్షన్ చిత్రాలుగా నిలిచిపోయాయి.

టర్నింగ్ పాయింట్… గీతాంజలి

గీతాంజలి సినిమా వచ్చిందంటే ఆ క్రెడిట్ అంతా నాగర్జున గారిదే. ఎందుకంటే కొన్ని ఎవర్ గ్రీన్ క్లాసికల్ హిట్స్ అనుకోకుండా జరుగుతాయి.  కానీ కొన్ని మాత్రం ప్లాన్ చేస్తేనే జరుగుతాయి. ఆ కొవలోకే గీతాంజలి సినిమా వచ్చింది. ‘గీతాంజలి’ నాగర్జున గారికి, డైరెక్టర్ మణిరత్నం గారికి వారి కెరీర్ లో మరిచిపోలేని సినిమాగా నిలిచిందని అందరికి తెలిసిన విషయమే. ఈ సినిమాతో మణిరత్నం, నాగర్జునలు చేరిగిపోలేని ముద్ర వేసారని ప్రత్యెకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఎవర్ గ్రీన్ చిత్రం ప్లాన్ ప్రకారం జరిగింది అంటె పట్టుపట్టి నాగర్జున మణిరత్నంతో ఈ సినిమా చేయిచండం. మాములుగా కొన్ని హిట్ కాంబినేషన్ లు అలా కుదురుతాయి ‘గీతాంజలి’ విషయంలో నాగర్జున అనుకున్నాడు కాబట్టి జరిగింది. మణిరత్నం సినిమాలన్నీ మొదటి నుంచి తెలుగులో కూడా అనువాదం అవుతుండేవి.

అనిల్ కపూర్ కథానాయకుడిగా నటించిన చిత్రం పల్లవి అను పల్లవి, కార్తీక్, రేవతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మౌనరాగం రెండూ తెలుగులో అనువాదం అయ్యాయి. మౌనరాగం సినిమా విజయవంతం కాలేదు కానీ, ఈ సినిమా నాగర్జునకి బాగా నచ్చింది. ఆ సినిమా తీసిన విధానం, పాత్రల డైలాగ్ డెలివరీ, మ్యూజిక్ అన్ని బాగా నచ్చి నాగర్జున మణిరత్నంని కలిశాడు. తనతో సినిమా తీయమని మణిరత్నంని నాగర్జున అడిగాడు. మణిరత్నం డైరెక్ట్ తెలుగు సినిమా తెలుగు సరిగ్గా రాదు అని మొదట చెయ్యనని చెప్పినా నాగర్జునతో సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నాడు. తర్వాత వాళ్ళ కాంబినేషన్ నుండి వచ్చిన చిత్రమే గీతాంజలి. మొదట  మణిరత్నం  నాగర్జునతో సినిమా చేయాలనుకున్నప్పుడు ప్రోడ్యుసర్ ఏ.ఎమ్ రత్నం  ‘అగ్ని నచిత్రం’ అనే తమిళ్ సినిమాని నాగార్జున వెంకటేష్ లతో తెలుగులో రీమెక్ చెయ్యమని చెప్పాడు. ఆ సినిమా తెలుగులో ‘ఘర్షణ’ పేరుతో డబ్ చేశారు. మణిరత్నం రీమెక్ చెయ్యడానికి ఇష్టపడలేదు.

డైరెక్ట్ తెలుగు సినిమా తీస్తానన్నడు.  ఒక క్యాన్సర్ పేషెంట్ పాపను చూసి ఇన్స్పైర్ అయ్యి మణిరత్నం ‘గీతాంజలి’ కథను రాసుకున్నారు. ఆ  పాప పేరు అంజలి. ఆ పాప పేరు వచ్చెలా సినిమాకి గీతాంజలి అనే టైటిల్ పెట్టారు. ఈ సినిమాలో నాగర్జున నటనకి సౌత్ ఇండియా మొత్తం ఫిదా అయిపోయింది. ఈ సినిమాతో డైరెక్టర్  మణిరత్నం ఇండియన్ స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం హైలెట్ అవ్వగా పి.సి శ్రీరామ్ విజ్యువల్స్ మరో హైలెట్ గా చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి అప్పట్లో అవార్డుల పంట పండిందని చెప్పుకోవాలి. ఈ గీతాంజలి చిత్రం  నాగర్జున కేరీర్ లోనే టర్నింగ్ అని చెప్పుకోవాలి.  ఈ గీతాంజలి చిత్రం నాగర్జున కేరీర్, ఇండియన్ సినిమా కేరీర్ లోనే కాదు లవ్ స్టోరీస్ లోనే ఇదొక గొప్ప చిత్రం గా చెప్పుకోవచ్చు.

రాఘవేంద్ర రావు, నాగర్జున, కీరవాణి కాంబినేషన్ క్రేజ్

రాఘవేంద్ర రావు, నాగర్జున కాంబీనేషన్ లో మొత్తం తొమ్మిది సినిమాలు వచ్చాయి. వీరి కాంబినేషన్ అంటే మొదటగా గుర్తొచ్చే సినిమా ‘అన్నమయ్య’.  ఈ భక్తిరస చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాని మరో తిరుమల దేవస్థానంగా కొలిచారు. ప్రేక్షకులు ఈ సినిమాకి భక్తితో నీరాజనం పట్టారు. శృంగార రసం నుండి భక్తి రసం వైపు నడిచే విధానం ప్రేక్షకుల్ని మంత్ర ముగ్దుల్ని చేసింది. ఎమ్.ఎమ్ కీరావాణీ  సంగీతం ఈ సినిమాకి ప్రాణం పోసింది. ఈ సినిమాలో  వెంకటేశ్వర స్వామి  పాత్రలో సుమన్ నటించి అందర్ని మెప్పించాడు. నాగర్జున సరసన రమ్యకృష్ణ, కస్తూరి నటించారు.

వీరితో పాటు కలెక్షన్ కింగ్ మొహన్ బాబు, రోజా, భాను ప్రియ నటించారు. ఈ చిత్రం బాక్స్ ఆఫిస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇప్పటికి ఈ సినిమా టి.వి లో వస్తే ప్రేక్షకులు హారతులు పడుతున్నారు. ఇప్పటికీ ఆ సినిమా మ్యూజిక్ ఆల్బమ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్బమ్ గా సేల్ అవుతూ ఉంది. ఇక వీరి కాంబినేషన్ లో వచ్చిన మాస్ మసాల చిత్రం ‘ఘరానా బుల్లోడు’. ఈ చిత్రం రికార్డ్ లు క్రియోట్ చేస్తూ బాక్స్ ఆఫిస్ బద్దలు కొట్టింది. ఈ సినిమాలోని పాటలు, ఫైట్స్ తో మాస్ ప్రేక్షకుల్ని ఉర్రతలూగించాయి. ఎమ్.ఎమ్ కీరవాణీ సంగీతం అందించిన ఈ సినిమా లోని ‘భీమవరం బుల్లోడా’ పాట  సూపర్ డూపర్ హిట్ అయ్యింది. 2006లో వచ్చిన ‘శ్రీరామదాసు’ ప్రేక్షకుల్ని భక్తి పరవశంలో ముంచెత్తింది.

ఈ సినిమాకి మూడు నంది ఆవార్డులు, రెండు ఫిల్మ్ ఫేయిర్ అవార్డులు లభించాయి.  ఎమ్.ఎమ్ కీరవాణీ ఈ సినిమాలో ఇచ్చిన పాటలు ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ గా నిలిచాయి. ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వర రావు నటించారు. నాగర్జునకి జోడిగా స్నేహా నటించింది. అగ్ని పుత్రుడు, ఆఖరి పోరాటం, జానకి రాముడు, అగ్ని, శిరిడి సాయి, ఓం నమో వెంకటేశాయ చిత్రాలు వీరి కాంబినేషన్ లో వచ్చాయి. ఈ చిత్రాలు మంచి విజయాలు అందుకున్నాయి. కీరవాణీ, రాఘవేంద్రరావు, నాగర్జున కాంబినేషన్ లో వచ్చిన అన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. వీరి కాంబినేషన్ లో  వచ్చిన సినిమాలు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాయి.

తెలుగు సినిమాకు కొత్త అడుగులు నేర్పించిన శివ

1989 అక్టోబర్ 5న ఒక తెలుగు సినిమా రీలిజ్ అయ్యింది. ఆ సినిమాను థియోటర్ లో చూసిన ప్రేక్షకుల్లో కొత్త అనుభవం. ఈ సినిమా ఏంటీ ఇలా ఉంది, హీరో కొత్తగా మాట్లాడుతున్నాడు, ఎప్పుడు వచ్చే లవ్ ట్రాక్ లేదు, హిరోయిన్ గ్లామర్ సీన్స్ లేవు, కామేడి ట్రాక్స్ లేవు, విలన్ వచ్చిన సన్నివేషాలు ఇంత కిరాతకంగా ఉన్నాయి. అంటూ ప్రజలు ఆశ్చర్యపోయారు. తర్వాత సినిమా అంటే ఇలా ఉండాలి అంటూ తెలుగు సినిమా చరిత్ర గర్వపడేలా సుపర్ డూపర్ హిట్ చేశారు. ఆ సినిమా పేరు శివ. దర్శకుడి పేరు రామ్ గోపాల్ వర్మ. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే తెలుగు సినిమా రోటిన్ ఫార్ములా నుండి వేరుగా సినిమా మేకింగ్ స్థితి గతుల్ని మారుస్తూ వచ్చిన సినిమా  శివ సినిమా. ఇప్పటికీ తెలుగు సినిమా అంటే శివ సినిమాకి ముందు శివ సినిమా తర్వాత అని చెప్తారు. తెలుగు సినిమా మీద అంతగా ‘శివ’ సినిమా ప్రభావం చూపించింది.

ఈ సినిమా నుండి ఎంతో మంది తెలుగు సినిమాకి పరిచయమయ్యారు. రామ్ గోపాల్ వర్మ నుండి వచ్చిన అసిస్టెంట్ లు చాలా మంది ఈ రోజు ఫిల్మ్ మేకర్స్ అయ్యారు. అన్నపూర్ణ స్టూడియోలో సౌండ్ రికార్డిస్ట్ గా పనిచేస్తున్న కృష్ణం రాజు గారి అబ్బాయి రామ్ గోపాల్ వర్మ.  మూవీ హౌస్ పేరుతో ఓ వీడియో షాప్ నడిపేవాడు. ‘కాలెక్టర్ గారి అబ్బాయి’ సినిమాకి రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అప్రెంటిస్ గా చేసారు. తండ్రికి నాగర్జున గారితో ఉన్న పరిచయంతో నాగర్జునకి రామ్ గోపాల్ వర్మ కథ చెప్పాడు. నాగర్జున ‘శివ’ కథని రామ్ గోపాల్ వర్మ నారేట్ చేసిన విధానానికి ఇంప్రెస్ అయ్యి రామ్ గోపాల్ వర్మకి అవకాశం ఇచ్చాడు.  అలా  మొదలైన ప్రాజెక్ట్ కి తనికెళ్ళ భరణి తో స్క్రిప్ట్ రాయించారు. శివ స్రిప్ట్ రాసిన తనికెళ్ళ భరణి కూడా ఈ సినిమా ఆడదు అనుకున్నారు. హిరో పాత్రకి భవాని, విలన్ పాత్రకి శివ అని పేర్లు పేట్టాడు వర్మ. కానీ నాగర్జున హిరో పేరు శివగా విలన్ పేరు భవానిగా మార్పించాడు. హిరోయిన్ గా అమల, విలన్ గా రఘువరన్, ముఖ్య పాత్రల్లో  జే.డి చక్రవర్తి, తనికెళ్ళ భరణి, సాయిచంద్ లు చక చక కాస్టింగ్ చేసి  సినిమా మెదలు పెట్టారు.  అప్పటికే ప్రేమ యుద్దం సినిమాలో నాగర్జున , అమల కలిసి నటించారు.ఈ సినిమా షూటింగ్ సమయంలోనే అమల, నాగార్జున ప్రేమ లో పడ్డారు.

రామ్ గోపాల్ వర్మ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న తేజ టైటిల్ లోగో ని   సైకిల్ చెయిన్ తో డిజైన్ చేశాడు. అది ట్రెండ్ సెట్టర్ అయ్యింది. రామ్ గోపాల్ వర్మ తన చదువుకున్న సిద్దార్థ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన సంఘటనలు సన్నివేశాలుగా మలిచి ఈ చిత్రం తెరకెక్కించాడు. తన స్నేహితుల పేర్లు ఈ సినిమాలోని పాత్రల పేర్లుగా పెట్టాడు.  ఎస్ గోపాల్ రెడ్డి గారిని సినిమాటోగ్రాఫర్ గా తీసుకున్నాడు. ఈ సినిమాకి ఇళయరాజ సంగీతం అందించాడు. మొదట ఈ సినిమాకి ఎమ్.ఎమ్ కీరవాణీ గారిని సంగీత దర్శకునిగా అనుకున్నారు రామ్ గోపాల్ వర్మ. కానీ ఇద్దరికి అది మొదటి చిత్రం అవుతుంది అనుభవం ఉన్న సంగీత దర్శకుడు ఉంటే బాగుంటుందని ఎమ్.ఎమ్ కీరవాణీని కాకుండా ఇళయరాజా గారిని సంగీత దర్శకునిగా తీసుకున్నారు. 1989 పిబ్రవరి 16న అన్నపూర్ణ స్టూడియోస్ లో ఉదయం పది గంటలకు ఈ సినిమా ప్రారంభమైంది. మొదట షెడ్యుల్ ప్రకారం నాగర్జున, కోదండ రామిరెడ్డి సినిమా మొదలవ్వాలి. కానీ సమాయానికి ఆ సినిమా కథ పూర్తి అవ్వకపోవడంతో ‘శివ’ సినిమా మొదలైంది.

నాగర్జున, అమల పై ముహుర్తపు షాట్ ను తీసారు.  అక్కినేని నాగేశ్వరరావు కెమెరా స్విఛ్ ఆన్ చేయగా కృష్ణంరాజు తొలి క్లాప్ ఇచ్చారు. ‘శివ’ సినిమా షూటింగ్ మొత్తం ఆంధ్రప్రదేశ్ లోనే జరిగింది మూడు రోజులు మాత్రం మద్రాస్ లో జరిగింది. ఒక్క పాట తప్ప మిగితా అన్ని పాటలు అన్నపూర్ణ స్టూడియోలో సెట్స్ వేసి షూట్ చేశారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న ఓ స్కూల్ లో కాలేజీకి సంబంధించి కీలక సన్నివేశాలు తీశారు. శుభలేక సుధాకర్ డెత్ సీన్ కీసర గుట్టలో తీసారు. ఇలా ‘శివ’ సినిమా షూటింగ్ మొత్తం ఇంట్రెస్టింగ్ గా గడిచింది. శివ సినిమా విడుదలై అప్పటి వరకున్న రికార్డులు చెరిపేస్తూ  కొత్త ట్రెండ్ సెట్ చేసింది. ఈ సినిమా నాగర్జున కేరీర్ లోనే ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఈ సినిమా తో అక్కినేని నాగర్జున్ స్టార్ హిరోగా ఎదిగాడు. ఆ తర్వాత ఈ చిత్రాన్ని హిందీలో కూడా రీమేక్ చేసారు.

అక్కినేని  రెబల్ డెసిషన్స్

అక్కినేని నాగర్జున డిసిషన్స్ ఎలా ఉంటాయో తను ఎంచుకున్న సినిమాలు చెపుతాయి. శివ, గీతాంజలి, మనం ఈ మూడు సినిమాలు నాగర్జున రెబల్ డిసిషన్స్ అని చెప్పొచ్చు. గీతాంజలి సినిమాకి ముందు మణిరత్నం గారికి ఆయనకు తగ్గ హిట్ రాలేదు.  అలాంటి ఒక తమిళ దర్శకుడితో తెలుగులో సినిమా చెయ్యడం అంటే రెబల్ డిసిషన్ అనే చెప్పుకోవాలి. ఈ సినిమా తర్వాత ఇండియా స్టార్ డైరెక్టర్ గా మణిరత్నం ఎదిగారు. అలాగే ఏ మాత్రం సినిమా ఎక్స్పీరియన్స్ లేని రామ్ గోపాల్ వర్మని నమ్మి శివ సినిమా ఇవ్వడమంటే చిన్న విషయం కాదు అందుకు గట్స్ ఉండాలి. ఆ గట్ డెసిషన్ తీసుకుని నాగర్జున ‘శివ’ సినిమా చేశాడు. ఆ సినిమా రిజల్ట్ అందరికి తెలిసిందే. కానీ రిజల్ట్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేయ్యడం కింగ్ నాగార్జునకే సాధ్యం. తర్వాత రామ్ గోపాల్ వర్మ క్రేజీ డైరెక్టర్ గా మారాడు. మనం సినిమా కోసం విక్రమ్.కె.కూమార్ ఇంకా ఇష్క్ సినిమా తీయ్యలేదు. సినిమా మధ్యలో ఉంది. ఇష్క్ సినిమా హిట్, ప్లాప్ తో సంబంధం లేకుండా  సినిమా నచ్చితే విక్రమ్.కె కుమార్ కి సినిమా ఇస్తానన్నాడు. సినిమా రీలిజ్ అవ్వకముందే ఫస్ట్ కాపీ చూసి నాగార్జున విక్రమ్.కె కుమార్ తో సినిమా కమిట్ అయ్యాడు. తర్వాత కట్ చేస్తే మనం సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమా తర్వాత విక్రమ్.కె కుమార్ స్టార్ డైరెక్టర్ గా మారి కెరీర్ లో అఫర్స్ స్టార్ట్ అయ్యాయి. ఎప్పటికప్పూడు కొత్త సినిమాలు చేస్తూ కొత్త దర్శకులను పరిచయం చేసే నటుడు నాగర్జున. నాగర్జున నుండి చాలా మంది నటులు ఈ  విషయాన్ని నేర్చుకున్నారు. ఎందుకంటే ఒకప్పుడు స్టార్ హిరోలు అంటే స్టార్ దర్శకులతో మాత్రమే చేస్తూ సేఫ్ సైడ్ లో ఉండేవారు. కానీ నాగర్జున ఆ గీతని ‘శివ’ సినిమాతో  చెరిపేశారు. అలాగే యువ దర్శకులతో సినిమాలు చేయ్యటంలో ముందుటాడు. అలాగే కొత్త రకమైన సబ్జెక్ట్స్ తో ఎక్స్ పెరిమెంట్ చేస్తూ కుర్ర హీరోలకు గట్టి పోటి ఇస్తుంటాడు. అరవై ఎళ్ళలో కూడా స్ర్కీన్ మీద ఇంకా యంగ్ గా కనిపిస్తూ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూన్నాడంటే కేవలం ఫిట్ నెస్ మాత్రమే కాదు ఆలోచనా విధానం.

అక్కినేని కుటుంబానికి ‘మనం’ స్పెషల్

అక్కినేని ఫ్యామిలీకి మర్చిపోలేని, తరతరాలుగా గుర్తుండే క్లాసిక్ సినిమా ‘మనం’. అందుకు కారణం ఈ సినిమాలో అక్కినేని వారి మూడు తరాలు నటించండమే. ముఖ్యంగా  లెజెండ్రీ నటుడు అక్కినేని నాగేశ్వరావు గారు ఈ సినిమాలో నటించండం. నాగేశ్వర రావు గారి చివరి సినిమా ‘మనం’. నాగేశ్వర రావు గారి సినిమాలో చివరి షాట్ చిరస్మరణీయం. మే 13, 2104లో ఈ సినిమా విడుదలై ప్రేక్షకుల మనస్సు దోచుకుంది. ఈ సినిమా అక్కినేని ఫ్యామిలిలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాని అన్నపూర్ణ బ్యానర్ పై అక్కినేని నాగర్జున నిర్మించారు. ఈ సినిమాకి విక్రమ్.కె కూమార్ దర్శకత్వం వహించారు. అనుప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు నాగర్జున గారు విక్రమ్.కె కుమార్, అనుప్ రూబెన్స్ కి ఇప్పటికీ థ్యాంక్స్ చెప్తూనే ఉంటాడు.

శివ తర్వాత

శివ సినిమాతో నాగర్జున తెలుగు ఇండస్ట్రీని షేక్ చేశాడు. శివ సినిమా తర్వాత చెప్పుకోదగ్గ హిట్ పడలేదు. దాదాపు పది చిత్రాల వరకూ సరైన హిట్ పడలేదు. అప్పటి వరకూ చేసిన సినిమాలు అన్నీ నిరాశపరిచాయి. కానీ నాగర్జున హిట్ తో సంబంధం లేకుండా సినిమా లు చేస్తూ వచ్చాడు. ప్రేమ యుద్దం, నేటి సిద్దార్థ, ఇద్దరూ ఇద్దరే, నిర్ణయం, చైతన్య, శక్తి క్రాంతి, జైత్రయాత్ర, కిల్లర్, అంతం సినిమాలు విడుదల అయ్యాయి. ఈ సినిమాలు అశించినంత ఫలితానివ్వకపోయినా  ఇందులో  నిర్ణయం, కిల్లర్, అంతం సినిమాలు చెప్పుకోదగ్గవి. నిర్ణయం సినిమా 1991 సంవత్సరం లో విడుదలైంది. ఈ సినిమా1989 లో విడుదలైన మలయాళ సినిమా  వందనం సినిమాకి రీమేక్.  

ఈ చిత్రానికి  ప్రియదర్శన్ దర్శకత్వం వహించాడు. మలయాళంలో కూడా ప్రియదర్శన్ యే దర్శకత్వం చేశాడు. మెయిస్ట్రో ఇళయరాజా ఈ సినిమాకి సంగీతం అందించడం విశేషం. అక్కినేని నాగర్జున, అమల కాంబినేషన్ లో వచ్చిన మూడోవ సినిమా నిర్ణయం. ఈ చిత్రంలోని “హలో గురు ప్రేమ కోసమే” పాట సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ‘కిల్లర్’ సినిమాలో నాగర్జున సరసన నగ్మ నటించారు. శారద గారు సినిమాలో మరో ముఖ్య పాత్రలో కనిపించారు. ఒక పాపని కాంట్రాక్ట్ కిల్లర్ చంపే ఇతివృత్తంతో సినిమా కథ సాగుతుంది. ఈ చిత్రం లోని నాగర్జున స్టైల్ తో, నగ్మ అందం, అభినయంతో ప్రేక్షకులను మెప్పించారు. ఈ సినిమాకి మలయాళ దర్శకుడు. ఫాజిల్ దర్శకత్వం వహించగా ఇళయరాజా సంగీతం అందించారు. ‘అంతం’ సినిమాతో రామ్ గోపాల్ వర్మ, నాగార్జున కాంబినెషన్ మళ్ళీ రిపీట్ అయ్యింది.

ఈ సినిమాలోని పాటలు సూపర్ డుపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమా ఆశించినంత విజయం అందుకోక పోయినా విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఈ చిత్రానికి సంగీతం ఆర్.డి బర్మన్, మణిశర్మ, కీరవాణి ముగ్గురు కలిసి సంగీతం అందించారు. ఆ తర్వాత వచ్చిన  ‘ప్రెసిడెంట్ గారి పెళ్ళాం’ బాక్స్ ఆఫిస్ బద్దలు కొట్టింది. కొందడ రామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి కలెక్షన్స్ సాధించింది నాగార్జున, మీనా జంటగా నటించిన ఈ చిత్రానికి ఎమ్.ఎమ్ కీరవాణీ  సంగీతం అందించారు. అక్టోబర్ 30,1992న విడుదలైన ఈ సినిమా నాగర్జునను మళ్ళీ ఫామ్ లోకి తీసుకొచ్చి తిరిగి నాగర్జునని బాక్స్ ఆఫిస్ రేసులో నిలబెట్టింది.

కామేడి టచ్

నాగర్జున, రొమాన్స్, యాక్షన్ మూవీస్ కాకుండా కామెడీ చిత్రాలు కూడా చేశాడు. మంచి టైమింగ్ తో నాగర్జున తన ప్రత్యేకమైన శైలితో కామెడి పండించేవాడు. అందుకు హలో బ్రదర్, ‘ఆవిడా మా ఆవిడే’, రాముడొచ్చాడు, నిన్నే పెళ్ళాడతా, మన్మధుడు లాంటి చాలా సినిమాల్లో నాగర్జునలోని కామెడి యాంగిల్స్ చూడొచ్చు. ఈ చిత్రాలకు నాగర్జున సినిమా లిస్ట్ లో ప్రత్యేక స్థానం ఉంటుంది.

బ్యాక్ టు బ్యాక్ హిట్స్:

సరైన హిట్ లేక ఆకలి మీద ఉన్న నాగర్జునకి నిన్నె పెళాడతా, అన్నమయ్య, ఆవిడా మా ఆవిడే సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ వచ్చాయి. కృష్ణ వంశీ దర్శకత్వం వహించిన  ‘నిన్నే పెళ్ళడతా’ సినిమా నాగర్జున కేరిర్ లో సుపర్ హిట్ గా చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో నాగర్జున నటనకి అందరూ ఫిదా అయిపోయారు. ఈ సినిమా లోని పాటలు యువతని ఒక ఊపు ఊపింది. ‘ఏటో వెళ్ళిపోయింది మనస్సు’ పాట ఇప్పటికీ టి.వి లో వస్తే కన్నార్పకుండా చూస్తారు ప్రేక్షకులు. అన్నమయ్య చిత్రం భక్తిరస చిత్రంగా తెరకెక్కి ఆంధ్ర ప్రదేశ్ లో ప్రతి ఇంటికీ దర్శనం ఇచ్చింది. ఈ సినిమాలో వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నాగర్జున అదరగొట్టేశాడు.

రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలైన సమయంలో థియేటర్లలో జనం ఎగబడి వచ్చే వాళ్ళు. విడుదలైన ప్రతి థియేటర్ యాజమానులు హౌజ్ ఫుల్ బోర్డ్ లు పెట్టుకున్నారంటే అతిశేయోక్తి కాదు. ఇప్పటికీ ఈ చిత్రం టెలివిజన్ లో ప్రసారమవుతూ ప్రేక్షకులకు దర్శనమిస్తూ ఆనాటి రోజులు గుర్తుకు తెస్తుంది. ఈ చిత్రంలో సుమన్, మోహన్ బాబు, భానుప్రియ, రోజా, రమ్యకృష్ణ నటించారు. ఈ సినిమాకి సంగీతం ఎమ్.ఎమ్ కీరవాణీ అందించారు. ఈ చిత్రంలోని పాటలు ప్రతి ఊర్లో, ప్రతి ఇంట్లో, ముఖ్యంగా ప్రతి గుడిలో మారుమోగాయి. ‘ఆవిడా మా ఆవిడే’ సరదాగా థియోటర్ కి వెళ్ళి సినిమా చూసేవాళ్ళకి  లెక్కెస్తే  చాలా తక్కువ చిత్రాలు ఉంటాయి ఆహ్లాదకరంగా కుటుంబ సమేతంగా ఉండదగ్గ చిత్రం అవిడా మా ఆవిడే. టెన్షన్, బీజీగా సాగే లైఫ్ లో ఈ లాంటి చిత్రాలు  రెండున్నర గంటలు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని ఇస్తాయి. ఫ్యామిలీ కథాంశంతో తెరకెక్కి  ఆహ్లాదకరంగా చక్కటి వినోదంతో సాగే ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించింది. రక్షణ, సీతారామరాజు, నువ్వు వస్తావనీ, నిన్నే ప్రేమిస్తా, ఎదురులేని మనిషి, స్నేహామంటే ఇదేరా, ఆకాశవీధిలో, సంతోషం, మన్మధుడు, శివమణి, నేనున్నాను, మాస్, శ్రీరామదాసు, కింగ్, గగనం, మనం, ఊపిరి ఇంకా పలు చిత్రాలు నాగర్జున కెరీర్ లో హిట్ సినిమాలు అని చెప్పుకొవచ్చు. నాగర్జున దాదాపు తొంబై సినిమాల్లో నటించాడు.

టి.వి రంగం లోకి

ఇండియాలో వన్ ఆఫ్ ది సక్సెస్ పుల్ షో  ‘కౌన్ బనేగా కరోడ్ పతి’. ఈ షోకి బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా చేసి ఈ షోకి ఎనలేని క్రేజ్ తెచ్చిపెట్టాడు. తెలుగులో ‘మీలో ఎవరు కోటిశ్వరుడు’ షోకి నాగర్జున గారు హోస్ట్ చేశారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నాగ్ క్రేజ్. తర్వాత బిగ్ బాస్-3కి హోస్టింగ్ చేసిన ఆయన సీజన్-4 కు కూడా హోస్ట్ గా చేస్తున్నారు. సినిమా రంగంలోనే కాదు టి.వి రంగంలో కూడా తనదైన శైలిలో అభిమానులను అలరిస్తూ దూసుకెళ్తున్నాడు. అలాగే అన్నపూర్ణ స్టూడియో పతాకంపై ఎన్నో సినిమాలు నిర్మించి నిర్మాతగా కూడా సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్నాడు.

అవార్డ్స్

నాగర్జున సినీ జీవితంలో ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నాడు. ఈ యువసామ్రాట్ తొమ్మిది నంది అవార్డులు, మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డులు అలాగే రెండు నెషనల్ ఫిల్మ్ అవార్డ్,  రెండు సౌత్ ఇండియా ఇంటనేషనల్ అవార్డ్స్ , స్పేషల్ జ్యూరీ అవార్డు ఇలా ఎన్నో అవార్డులు అందుకున్నారు.

ప్రస్తుతం వైల్డ్ డాగ్ సినిమా లో నటిస్తూ, బిగ్ బాస్ షో హోస్ట్ చేస్తున్నాడు. తెలుగు ప్రేక్షకుల యువసామ్రాట్, టాలీవుడ్ కింగ్,  అరవై ఏళ్ళ నవ మన్మధుడు అక్కినేని నాగర్జున  నుండి ఇంకా ఎన్నో  మంచి సినిమాలు రావాలని కోరుకుంటూ  కింగ్ నాగ్ కి ఆల్ ది బెస్ట్.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.