అఖిల్ అక్కినేని కెరీర్ మొదలై ఐదేళ్లు పూర్తయింది. ఈ ఐదేళ్ళలో మూడు సినిమాలు మాత్రమే చేసిన అఖిల్ ఒక్కటంటే ఒక్క హిట్ కూడా సాధించలేకపోయాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో చేస్తోన్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. షూటింగ్ ఆఖరి దశలో ఉంది. జనవరిలో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. పూజ హెగ్డే ఈ సినిమాలో కథానాయిక.మరోవైపు అఖిల్ తన నెక్స్ట్ సినిమాను కూడా లైన్లో పెట్టిన విషయం తెల్సిందే.
అఖిల్ ఐదవ చిత్రం స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రథమార్ధంలో మొదలుపెట్టనున్నారు. ఇదిలా ఉంటే అఖిల్ తన ఫ్రీ టైమ్ ను గుర్రపుస్వారీతో గడపుతాడని ఇటీవలే రివీల్ చేసాడు.అఖిల్ కు సొంత గుర్రం ఉంది. దాని పేరు గిజిల్. వీకెండ్స్ లో గుర్రపుస్వారీతో రీఛార్జ్ అవుతానని అఖిల్ తెలిపాడు. అయితే ఈరోజు తన ఇన్స్టాగ్రామ్ లో గుర్రపు స్వారీ చేస్తున్న వీడియోను పోస్ట్ చేసాడు. "రోజును ఇలా ఆరంభిస్తే అంతకంటే ఏం కావాలి" అని క్యాప్షన్ ను జత చేసాడు.