అచ్చం మేజర్ సందీప్ లాగా అడివి శేష్

విభిన్నమైన కథలను ఎంచుకుంటారు అడివి శేష్ టాలీవుడ్ లో చాలా మంచి పేరు ఉంది. అలాగే తాను హీరోగా చేస్తున్న చాలా వరకు సినిమాలకి తనే స్టోరీ కూడా రాసుకుంటాడు. ఇలా ఆయన రాసుకున్న ఎవరు, క్షణం, గూఢచారి లాంటి సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఇక అడివి శేష్ హీరోగా న‌టిస్తోన్న తాజా చిత్రం ‘మేజ‌ర్‌’. గూఢ‌చారి ఫేం శ‌శికిర‌ణ టిక్కా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ మూవీని మహేష్ బాబు తన జీ.ఎం’బీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో శోభితా ధూళిపాళ్ల హీరోయిన్‌గా నటిస్తోంది. ముంబై బాంబ్ బ్లాస్ట్‌లో వీర మరణం పొందించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని శశి కిరణ్ తెరకెక్కిస్తున్నాడు. ఇక మేజర్ సినిమా అసలు ఎలా మొదలయ్యింది అని అడివి శేష్ చెప్తూ ఒక వీడియో ని లుక్ టెస్ట్ పేరుతో మేజర్ మూవీ టీం విడుదల చేసారు. మేజర్ సినిమా నాలో 2008 నుంచి ఉందని ఈ సినిమా స్టోరీ మీద అప్పటినుంచి పని చేస్తున్న అని మేజర్ సినిమా ఓకే అయినప్పుడు అడివి శేష్ వెళ్లి సందీప్ ఉన్నికృష్ణన్ తల్లి తండ్రులని కలిసి మాట్లాడను అని ఆయన అన్నారు. వీడియో చివరిలో అడివి శేష్ అచ్చం మేజర్ సందీప్ లాంటి లుక్ తో మనకు కనిపిస్తారు. ఈ సినిమా తెలుగు ,హిందీ భాషలలో పాన్ ఇండియా అంత విడుదల కాబోతుంది.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.