నటుడు ఆదర్శ్ బాలకృష్ణ హ్యాపీ డేస్ సినిమాతో తెలుగులో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. సరైన ఒడ్డూ, పొడుగూ ఉండే ఆదర్శ్ బాలకృష్ణకు అవకాశాలు కూడా బానే వస్తున్నాయి. ఆ మధ్యలో బిగ్ బాస్ సీజన్-1 లో పార్టిసిపేట్ చేసిన ఆదర్శ్ ఫైనలిస్ట్ గా నిలిచాడు. శివబాలాజీ విన్నర్ కాగా ఆదర్శ్ రన్నరప్ గా నిలిచాడు. ఇక బిగ్ బాస్ తర్వాత కూడా వచ్చిన ఫేమ్ తో మంచి మంచి అవకాశాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఏడాది అశ్వద్ధామ, వి, కలర్ ఫోటో సినిమాల్లో నటించాడు ఆదర్శ్. ప్రస్తుతం వెబ్ సిరీస్ లతో కూడా బిజీగా మారుతున్నాడు ఈ నటుడు. ఉల్లూ ఒరిజినల్స్ నిర్మించిన పెషావర్ వెబ్ సిరీస్ లో ఆదర్శ్ కీలక పాత్రను పోషించాడు. 2014, డిసెంబర్ 14న ఆర్మీ పబ్లిక్ స్కూల్ పై జరిగిన దాడి ఆధారంగా ఈ సిరీస్ ను తెరకెక్కించారు. ఆ దాడిలో దాదాపు 148, అందులోనూ చిన్నారులు ఎక్కువగా చనిపోయారు. రా ఏజెంట్ పాత్రలో ఆదర్శ్ కనిపించనున్నాడు. డిసెంబర్ 16న ఈ వెబ్ సిరీస్ ఉల్లూలో విడుదల కానుంది.
A project supremely close to my heart! Witness the unrevealed chronicles of a few fearless commanders and their unheard stories about a terror attack in a school that shook the world! #Peshawar releasing 16th December,only on the @ULLUapp https://t.co/J8l7R5wtKR
— Aadarsh Balakrishna (@AadarshBKrishna) December 10, 2020