
లాక్ డౌన్ పుణ్యమా అని ఓ.టి.టిలకు డిమాండ్ పెరిగిపోయింది. అప్పుడు థియేటర్లు ఓపెన్ చేసే వీలు లేదు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఓ.టి.టిల్లో విడుదల చేయాల్సి వచ్చింది. నాని, సుధీర్ బాబులు నటించిన ‘V’ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది. దాంతో పాటు సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా చిత్రం కూడా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. వీటితో పాటు అనుష్క నటించిన నిశ్శబ్దం, ఒరేయ్ బుజ్జిగా, అనగనగా ఓ అతిధి, కలర్ ఫోటో లాంటి పలు చిత్రాలు ఓ.టి.టిల్లో విడుదలయ్యాయి.

ఆ తర్వాత థియేటర్లు ఓపెన్ అయిన తర్వాత కూడా కొన్ని సినిమాలు ఓ.టి.టిల్లో రిలీజ్ అయ్యాయి. వాటితో పాటు థియేటర్లలో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్స్ అయిన సినిమాలు కూడా ఓ.టి.టిల్లో విడుదలయ్యాయి. సంక్రాంతికి విడుదలయి బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచిన క్రాక్, రెడ్, మాస్టర్ సినిమాలు కూడా ఓ.టి.టిల్లో రిలీజ్ అయ్యాయి. క్రాక్ ఆహలో విడుదలవగా, రెడ్ నెట్ఫ్లిక్స్ లో, మాస్టర్ అమెజాన్ ప్రైమ్ లో విడుదలయ్యాయి.

ఈ కోవలోనే పలు చిత్రాలు థియేటర్స్ లో రిలీజ్ అయ్యి కూడా ఓ.టి.టిల్లో రిలీజ్ అవుతున్నాయి. చిన్న చిత్రంగా వచ్చి పెద్ద విజయం సాధించిన చిత్రం జాతిరత్నాలు. ఈ చిత్రం విడుదలైన 2 వారాలు హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. ఏప్రిల్ 11న ఈ చిత్రం ప్రైమ్ లో ఈ చిత్ర ప్రీమియర్ వేయనున్నారు. ఈ చిత్రంతో పాటు ఉప్పెన సినిమా కూడా ఓ.టి.టిలో విడుదల కానుంది.