మొదలైన క్రేజీ ప్రాజెక్ట్

అక్కినేని నాగార్జున కథానాయకుడిగా క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో
తెరకెక్కనున్న చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్, నార్త్ స్టార్ ఎంటర్తైన్మెంట్  బ్యానర్స్ పై ప్రముఖ నిర్మాతలు నారాయణ్ దాస్ నారంగ్, శరత్ మరార్, రామ్మోహన్ రావులు ఈ  చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో ఈ చిత్రం ఉండనున్నట్లు సమాచారం. ఈ చిత్ర ప్రారంభానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి ఆయన క్లాప్ ఇచ్చి సినిమాను ప్రారంభించారు. విభిన్న కథలను తెరకెక్కించే ప్రవీణ్ సత్తారుతో నాగార్జున చిత్రం చేస్తుండడంతో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు భారిగా నెలకొని ఉన్నాయి. చందమామ కథలు, గుంటూరు టాకీస్, పి.ఎస్.వి గరుడవేగ లాంటి చిత్రాలతో ప్రయోగాత్మక దర్శకుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు ప్రవీణ్ సత్తరు. చందమామ కథలు చిత్రానికి ఆయన నేషనల్ అవార్డ్ కూడా అందుకున్నారు. ఈ సందర్భంగా ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ స‌త్తారు మాట్లాడుతూ “నాగార్జున గారు  హీరోగా నేను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న మూవీ ఈ రోజు సికింద్ర‌బాద్ గ‌ణేష్ టెంపుల్‌లో ముహూర్తం జ‌రుపుకోవ‌డం చాలా సంతోషంగా ఉంది. ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేయ‌డానికి మా టీమ్ అంద‌రం చాలా ఎగ్జ‌యిటింగ్‌గా, ఎన‌ర్జిటిక్‌గా ఉన్నాం. ఇదొక స్టైలిష్ యాక్ష‌న్ ఫిలిం. ఈ సినిమాలో న‌టించే ఇత‌ర నటీన‌టులు, టెక్నీషియ‌న్స్ వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తాం” అన్నారు. నాగార్జున చేసిన గత రెండు చిత్రాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఈ చిత్రం ఆయనకు విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.