
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మహానటిగా పేరు గాంచిన నటి సావిత్రి గారి జయంతి నేడు. 1935లో డిసెంబర్ 6, గుంటూరు జిల్లాలోని చిర్రావూరులో ఆవిడ జన్మించారు. సినిమా పై మక్కువతో పెదనాన్న కొమ్మారెడ్డి వెంకట్రామయ్యతో కలిసి మద్రాస్ నగరం వచ్చి కష్టపడి సినిమా అవకాశాలు దక్కించుకొని తనలోని నటనా కౌశలాన్ని ప్రదర్శించి వెండితెర పై ఆణిముత్యాల్లాంటి అనేక సినిమాల్లో నటించి మెప్పించారు. 1950లో వచ్చిన ‘సంసారం’ సినిమా నుంచి 1979లో వచ్చిన గోరంటాకు సినిమా వరకు మొత్తం 83 చిత్రాల్లో సావిత్రి గారు నటించింది. 1950లో ‘సంసారం’ సినిమాలో చిన్న పాత్రలో నటించింది. ఆ తరువాత చేసిన మరో ఐదు సినిమాలు కూడా చిన్న చిన్న సినిమాలే. అయితే 1953లో ఆమె మెయిన్ హీరోయిన్ గా అక్కినేని నాగేశ్వర రావు గారితో కలిసి చేసిన ‘దేవదాస్’ సినిమాతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి ఆవిడ వెను తిరిగి చూసింది లేదు. నటిగా మాత్రమే కాకుండా సావిత్రి దర్శకురాలిగా ఆరు సినిమాలు చేశారు. దక్షిణాదినే కాకుండా హిందీలో కూడా సావిత్రి గారు కొన్ని సినిమాలు చేశారు. సినిమాల్లో హవా సాగిస్తున్న సమయంలోనే ఆమె శివాజీ గణేష్ గారిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సావిత్రి గారి బయోపిక్ గా వచ్చిన ‘మహానటి’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. అంతటి మహనటికి ఘన నివాళ్ళు అర్పిస్తోంది మీడియా9.