రానున్న రోజుల్లో టాలీవుడ్ లో సందడి చేయనున్న సినిమాలు ఇవే

సినిమా థియేటర్లు తెరుచుకున్నాయి. కోవిడ్ తర్వాత జనాల రెస్పాన్స్ ఎలా ఉంటుందా అన్న దానికి పెర్ఫెక్ట్ ఉదాహరణగా నిలిచాయి సంక్రాంతి సినిమాలు. ముఖ్యంగా క్రాక్ సినిమాకు వస్తోన్న కలెక్షన్స్ తో అందరూ ఆశ్చర్యపోతున్నారు. 50 శాతం ఆక్యుపెన్సీతోనే క్రాక్ చిత్రం 30 కోట్లకు పైన షేర్ వసూలు చేయగలిగింది. సంక్రాంతికి రెస్పాన్స్ బాగుంది కాబట్టి ఇక రిలీజ్ కాకుండా ఆగిపోయిన సినిమాలు, రిలీజ్ కు సిద్ధమైనవి క్యూ కడుతున్నాయి. ఇప్పటికే జనవరి 23న బంగారు బుల్లోడు విడుదలైంది. ఈ నెల 29న ప్రదీప్ మాచిరాజు నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా విడుదల కానుంది. ఫిబ్రవరి 5న ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన జొంబి రెడ్డి విడుదలవుతోంది. అలాగే ఫిబ్రవరి 12న రెండు సినిమాలు శశి, ఎఫ్సియూకె విడుదలలను ప్రకటించాయి. అలాగే 19న పొగరు, నితిన్ నటించిన చెక్ తమ విడుదల తేదీలను ఖరారు చేసుకున్నాయి. ఫిబ్రవరి 26న అక్షర సినిమా విడుదలవుతుండగా మార్చ్ 11న మహా శివరాత్రి వీకెండ్ కావడంతో ఏకంగా నాలుగు సినిమాలు తమ విడుదల తేదీలను ఖరారు చేసుకున్నాయి. అవే శ్రీకారం, గాలి సంపత్, మోసగాళ్లు, జాతి రత్నాలు. మరి ఈ సినిమాలతో టాలీవుడ్ మళ్ళీ ఒకప్పటిలా కోలుకుంటుందేమో చూడాలి.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.