
టాలీవుడ్ లో గత కొన్ని రోజులుగా హిట్ సినిమాలకు సీక్వెల్స్ చేయడం ఆనవాయితీగా మారింది. సినిమా సూపర్ హిట్ అయితే దానికి ఇదొక లింక్ ఇచ్చి సీక్వెల్స్ ప్లాన్ చేస్తున్నారు.. అయితే సీక్వెల్ అంటే కథకు సంబంధం ఉండాల్సిన అవసరం లేదు.. పాత్రలకు మాత్రమే లింక్ ఉంటే సరిపోతుందని కొన్ని సినిమాలు చేస్తున్నారు.. అవి కూడా సీక్వెల్స్ కిందే లెక్కేస్తున్నారు.. మరికొన్ని ప్యూర్ సీక్వెల్స్ చేస్తూ ఒకేసారి రెండో హిట్ కూడా కొడుతున్నారు.. అలా టాలీవుడ్ ఈ సంవత్సరం కొన్ని ఇంట్రెస్టింగ్ సీక్వెల్స్ రాబోతున్నాయి..

నాని నిర్మాతగా తెరకెక్కిన హిట్ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా క్రైమ్ త్రిల్లర్ గా తెరకెక్కగా ఈ సినిమా ని హిట్ 2 పేరుతో అడవిశేష్ హీరోగా తెరకెక్కుతుంది. ఈమధ్యనే పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఇక నిఖిల్ నటించిన కార్తికేయ సినిమా కి కూడా సీక్వెల్ సిద్ధమవుతుంది.. షూటింగ్ చివరిదశలో ఉంది. చందు మొండేటి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి.. ఇక ఫ్యామిలీ ఆడియెన్స్ మొత్తాన్ని ఎంటర్టైన్ చేసిన F2 సీక్వెల్ F3 రెడీ అవుతుంది..

వెంకటేష్, వరుణ్ తేజ్ లు హీరోలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా లో మరో హీరో ఉండబోతున్నాడు అంటున్నారు.. ఆ హీరో ఎవరనేది ఇప్పటికీ సస్పెన్సు.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయన సీక్వెల్ బంగార్రాజు, అడవి శేష్ హీరోగా తెరకెక్కుతున్న మేజర్ సినిమా, జాతిరత్నాలు సినిమా కి సీక్వెల్, కెజిఎఫ్ సీక్వెల్ , మంచి విష్ణు ఢీ సినిమా సీక్వెల్ ఢీ అంటే ఢీ కూడా త్వరలోనే సీక్వెల్ గా ముస్తాబవుతున్నాయి.. రవితేజ క్రాక్ కూడా సీక్వెల్ గా రాబోతుందట.. మరి ఇవి ఫస్ట్ పార్ట్ లాగా సూపర్ హిట్ గా నిలుస్తాయా చూడాలి..