
టాలీవుడ్ లో కొన్ని కాంబో లు ఆసక్తికరంగా ఉంటాయి.. వీరి మధ్య ఎన్ని సినిమాలు వచ్చినా చూడాలనిపిస్తుంది. మళ్ళీ మళ్ళీ సినిమాలు చేస్తూ ఒకదానికి మించి మరొకటి హిట్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటారు.. అలాంటి వారిలో డైరెక్టర్, హీరోల కాంబో ఒకటి.. వీరి కాంబోలలో సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తుంటారు. ఒక సినిమా చేసిన తర్వాత మళ్ళీ అదే కాంబో లో సినిమా రావడం సహజమే.. మూడో సారి అంటేనే ఎంతో రిలేషన్ బాండ్ అయితేనే కానీ జరగదు. అలాంటి మన టాలీవుడ్ డైరెక్టర్ , హీరోలలో మూడు సినిమాలు చేసిన కాంబోలు ఇవేవీ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ , రవితేజ లది సక్సెస్ ఫుల్ కాంబినేషన్. వీరి కలయిక లో వచ్చిన ప్రతి సినిమా సూపర్ హిట్.. తొలి సినిమా ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమా తో మొదలైన వీరి కాంబో దేవుడు చేసిన మనుషులు వరకు కొనసాగింది.. మొత్తంగా వీరి కాంబో లో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న తమిళమ్మాయి, నేనింతే, దేవుడు చేసిన మనుషులు ఇలా ఐదు సినిమా చేసింది.. మరో ఆసక్తికర కాంబో ఎన్టీఆర్ రాజమౌళి.. వీరి కాంబినేషన్ లో స్టూడెంట్ నెంబర్ వన్, యమదొంగ, ఇప్పుడు RRR వస్తుంది.. ఈ సినిమా పై మంచి అంచనాలున్నాయి..

ఇక రవితేజ శ్రీను వైట్ల కాంబోలో సినిమాలు కూడా సూపర్ హిట్ లుగా నిలిచాయి.. వెంకీ, దుబాయ్ శ్రీను, అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలు ఇప్పటికే ప్రేక్షకులను అలరిస్తాయి. రాజమౌళి ప్రభాస్ ల కాంబో కూడా సూపర్ హిట్ గా నిలిచింది.. వీరిద్దరూ కలిసి మూడు సినిమాలు చేశారు.. ఛత్రపతి, బాహుబలి రెండు పార్ట్ లు ఎంత పెద్ద హిట్ లో అందరికి తెలిసిందే.. ఇక టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ కాంబినేషన్ అల్లు అర్జున్ త్రివిక్రమ్.. వీరి కాంబినేషన్ లో వచ్చిన ప్రతి సినిమా సూపర్ హిట్.. జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురంలో సినిమాలో ఇండస్ట్రీ హిట్ లుగా నిలిచాయి.. ఏదేమైనా హ్యాట్రిక్ సినిమాలు ఏ హీరోకైనా, దర్శకుడికైనా ఎంతో ప్రత్యేకమైనదని చెప్పొచ్చు.