
టాలీవుడ్ లో పలు సినిమాలతో బిజీ గా ఉన్న హీరోయిన్ సాయి పల్లవి ప్రస్తుతం అరడజను సినిమాలతో బిజీ గా ఉండగా తాజాగా ఆమెకు మరో అవకాశం కూడా తలుపుతట్టింది.. ఫిదా సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తమిళ భామ సాయి పల్లవికి తెలుగులో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. నిజానికి తెలుగులో ఒక్క సినిమా కూడా చేయకముందే ఆమెకు టాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. మలయాళం నుంచి ఒకటో రెండో సినిమాలు తెలుగులోకి రావడంతో పాటు ప్రేమమ్ సినిమా ఒరిజినల్ వెర్షన్ ని చూసి సాయి పల్లవి కి ఫిదా అయిపోయారు తెలుగు ప్రేక్షకులు.. ఆమె టాలీవుడ్ ఎంట్రీ కోసం ఎంతగానో వెయిట్ చేశారు.

అందరు అనుకున్నట్లే ఆమె తొలి సినిమాగా ఫిదా చేసింది.. ఆ సినిమాలో ఆమె సహజమైన నటనతో ప్రేక్షకులను మంత్రం ముగ్దులను చేసి ఆకట్టుకుంది.. ఒక్కసారిగా కుర్రకారు గుండెలని కొల్లగొట్టిన సాయి పల్లవి ఆ తర్వాత నాని సరసన MCA చిత్రంలో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఆ సినిమా తర్వాత పడిపడిలేచే మనసు లాంటి తదితర సినిమాల్లో నటించిన ఆమె ప్రస్తుతం లవ్ స్టోరీ సినిమాలో నటిస్తుంది.. ఇంకా రానా విరాట పర్వంలో కూడా సాయి పల్లవి నటిస్తుంది.. ఇవే కాకుండా మరో రెండు మూడు తెలుగు సినిమాలు కూడా ఆమె సైన్ చేసింది.

తాజాగా నితిన్ తో నటించేందుకు ఒకే చెప్పినట్లు సమాచారం.. నితిన్ ‘మేస్ట్రో’ చిత్రీకరణ చివరి దశలో ఉండగా.. నితిన్ తన తర్వాతి చిత్రానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ముందు అనుకున్నట్లు కృష్ణచైతన్యతో ‘పవర్ పేట’ను కాకుండా.. వక్కంతం వంశీతో ఓ సినిమాను మొదలుపెడుతున్నాడు నితిన్. ‘క్రాక్’ ప్రొడ్యూసర్ ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకోనుంది. ఈ చిత్రంలో నితిన్ సరసన సాయిపల్లవి నటించనున్నట్లు సమాచారం. ఇప్పటికే కథ, పాత్ర చెప్పి సాయిపల్లవిని ఒప్పించాడట వంశీ.