బాలయ్య పై సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్..!!

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న సినిమా అఖండ... రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్న బాలకృష్ణ ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకోగా అభిమానులు ఈ సినిమా కోసం ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ రిలీజ్ అయింది.. టీజర్ తో పాటు టైటిల్ కూడా రివీల్ చేసి  బాలకృష్ణ అభిమానులను ఖుషి చేశాడు బోయపాటి..

నెక్స్ట్ లెవెల్లో సినిమా ఉండబోతుంది అని టీజర్లతోనే చెప్పేశాడు బోయపాటి.. బోయపాటి గత చిత్రం వినయ విధేయ రామ దారుణమైన ఫలితాన్ని మిగల్చడం తో ఈ సినిమాపై 100% ఫోకస్ నిలిపాడు అని తెలుస్తుంది.. అయితే తాజాగా ఈ సినిమా లో హీరోయిన్ గా నటించిన ప్రగ్య అఖండ సినిమాకు సంబంధించిన మీడియాతో పలు విషయాలను షేర్ చేసుకుంది. ముందుగా ప్రగ్యా బాలయ్య గురించి మాట్లాడింది.

"బాలయ్య సార్ తో పనిచేయడం అద్భుతంగా ఉంది. ఎందుకంటే సెట్ లో ఆయనెప్పుడూ పవర్ హౌస్ లా పాజిటివ్ వాతావరణం క్రియేట్ చేస్తారు. సినిమాలో చేరకముందు ఆయన గురించి చాలా విన్నాను. కొంచం భయం వేసింది. కానీ తీరా సెట్స్ కి వెళ్ళాక ఆయన మాతో పాటే ఛిల్ల్ అవుతూ జోక్స్ వేస్తూ సరదాగా ఉండటం ఆశ్చర్యం వేసింది" అంటూ ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. అయితే ఇదివరకు డైరెక్టర్ బోయపాటితో ప్రగ్యా.. 'జయజానకి నాయక' అనే సినిమాలో వర్క్ చేసింది.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.