
దర్శక ద్వయం రాజ్, డి.కె అంటే వెంటనే గుర్తురాకపోవచ్చు కాని ఫ్యామిలీమ్యాన్ వెబ్ సిరీస్ గురించి తెలెఇయని వాళ్ళు అయితే ఉండరు. అంతలా ఆకట్టుకుంది ఆ వెబ్ సిరీస్. దేశంలో నెం1 సిరీస్ గా స్ట్రీమ్ అయ్యింది. ఈ సిరీస్ మొదటి సీజన్ వచ్చిన తర్వాత దీని సెకండ్ సీజన్ కోసం విపరీతంగా ఎదురు చూసారు. అభిమానులు అనుకున్నట్లుగానే మేకర్స్ దీని సెకండ్ సీజన్ ను అనౌన్స్ చేసారు. ఇందులో టాలివుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఒక ముఖ్యపాత్రను పోషిస్తోంది. ఆమె నటిస్తుండటంతో తెలుగు ప్రేక్షకులు కూడా దీని కోసం కళ్ళు కాయలు కాచేలాఎదురు చూసారు.
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఫ్యామిలీమ్యాన్ సీజన్- 2 త్వరలోనే మన ముందుకు రానుంది. దీనికి సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేసింది చిత్ర బృందం. మనోజ్ బాజ్పేయ్ శ్రీకాంత్ తివారిగా, సమంత రాజిగా నటిస్తున్నారు. మనోజ్ యధావిధిగా తన నటనతో ఆకట్టుకున్నారు. మొదటి సీజన్ లో ఉండే తలనోప్పులన్నీ ఈ సీజన్ లో కూడా ఉన్నాయి. ఇంట్లో భార్య పిల్లలతో, బయట టెర్రరిస్ట్లతో యుద్ధం చేస్తుంటాడు మన శ్రీకాంత్ తివారి.

ఇక తనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకుంటున్నట్లుగా కళ్ళ నిండా సంద్రాన్ని మోస్తున్నట్లుగా ఉంది సామ్. ఆమె పాత్ర తాలూకూ డిజైనింగ్ చాలా కొత్తగా ఉంది. జూన్ 4 నుండి సెకండ్ సీజన్ స్ట్రీమ్ అవనుంది. విడుదలకు ముందే ఇంత హంగామా చేసిన ఈ సిరీస్ విడుదల అయ్యాక ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి. ఈ ట్రైలర్ విడుదలైన 4 గంటల్లో 3.5 మిలియన్ వ్యూస్ తో ట్రెందింగ్ లో ఉంది.