ది కంప్లీట్ యాక్టర్

నటుడుగా మరియు కేరళ సూపర్ స్టార్ గా మోహన్ లాల్ గారికి ఇండియా అంతట గొప్ప పేరు ఉంది.దాదాపుగా 340 సినిమాల్లో నటించిన మోహన్ లాల్ గారు అటు ఇండస్ట్రీ హిట్స్ కొట్టడంలో ఇటు గొప్ప కథలని ఎంచుకోవడంలోను ఆయనే ఆదర్శం.60 సంవత్సరాల వయసులో కూడా ఆయన సినిమాల్లో భారీ ఫైట్ సీన్స్ చేస్తున్నారు అంటే  మోహన్ లాల్ గారికి నటన మీద ఉన్న ఆసక్తిని అర్థం చేసుకోవచ్చు.

జననం

1960 మే 21 న కేరళ రాష్ట్రంలో పథనంతిట్ట జిల్లాలో ఎలెన్తుర్ అనే గ్రామంలో విశ్వనాథన్ నాయర్ శాంత కుమారి దంపతులకు మోహన్ లాల్ విశ్వనాథన్ జన్మించారు.మోహన్ లాల్ గారికి ఒక అన్నయ్య ప్యార్ లాల్ కూడా ఉన్నారు . ఈయన 2000వ సంవత్సరంలో మిలటరీలో వ్యాయామం చేస్తుండగా చనిపోయారు. మోహన్ లాల్ గారి స్కూలింగ్ అంత తిరువనంతపురంలో ఉన్న ప్రభుత్వ మోడల్ బాయ్స్ హై స్కూల్ లో సాగింది. అక్కడ పదోవ తరగతి అయ్యాక మహాత్మా గాంధీ డిగ్రీ కాలేజ్ లో చేరారు.ఆయన ఇంటర్ లో ఉన్నప్పుడు బాక్సింగ్ లో పాల్గొని ఛాంపియన్ గా కూడా గెలిచారు.డిగ్రీ లో బి కామ్ గ్రూప్ తీసుకొని ప్రధమ శ్రేణిలో పాస్ అయ్యారు మోహన్ లాల్.ఆయనకి డిగ్రీ లో ఉన్నప్పుడే నాటకాల మీద బాగా ఆసక్తి ఉండేది.ఆ సమయంలోనే ఆయనకి సినిమా మీద ఆసక్తి ఉన్న వ్యక్తులు పరిచయం అయ్యారు. అందులో ప్రముఖ డైరెక్టర్ప్రియదర్శన్  కూడా ఉన్నారు. వీళ్లంతా సినిమాల్లోకి రావాలని అనుకునేవారు.

సినీ జీవితం

మోహన్ లాల్ గారికి ప్రత్యేకంగా సినిమాల్లో ప్రయత్నించడం కన్నా ఆయన స్నేహితుల అంత కలిసి ఒక సినిమా తీయాలని అనుకున్నారు. అలా అందరూ కొంత పెట్టుబడితో సినిమాని మొదలుపెట్టారు. అప్పటికే సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్  గా పని చేస్తున్న అశోక్ కుమార్ అనే వ్యక్తి వారికి పరిచయం అయ్యారు. ఇక అశోక్ కుమార్ ఆయన రాసుకున్న మరియు తెలిసిన కథలన్నీ చెప్పి వారితో కలిసిపోయారు. ఇక చివరికి మానసిక ఎదుగుదల లేని ఒక కుర్రాడి కథ ని మోహన్ లాల్ స్నేహితులు ఫైనల్ చేశారు.

ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఆయన స్నేహితుల్లో ఒకరైన ప్రియదర్శన్ చేశారు. ప్రియదర్శన్ కి అప్పట్లోనే డైరెక్షన్ మీద చాలా ఆసక్తి ఉండేది. ఈ సినిమాలో మోహన్ లాల్ హీరోగా చేశారు. ఇంకో స్నేహితుడు రవికుమార్ ఇంకొక ముఖ్యమైన పాత్రని ఎంచుకున్నారు. రేణు చంద్ర అనే కొత్త అమ్మాయి ని హీరోయిన్ గా ఎంచుకున్నారు.సినిమాకి అన్ని కుదిరాయి లొకేషన్ కూడా మోహన్ లాల్ సొంత ఇంట్లోనే  ఈ సినిమాని తీశారు. ఈ సినిమాకి తిరణోత్తమ్ అనే పేరు ని పెట్టారు. ఈ సినిమా కోసం అందరూ సంవత్సరం పాటు కష్టపడి చివరికి పూర్తి చేశారు.

ఈ సినిమా ప్రివ్యూ వేయడానికి ఒక్క థియేటర్ కూడా వాళ్ళకి లభించలేదు. వాళ్ళకి చివరికి ఒక థియేటర్ దొరికింది. తెలిసిన వారిని పిలిపించి ఈ సినిమాకి ప్రివ్యూ వేశారు. ఆ సినిమాని చూసి ఎవరు కొనలేదు. ఇక థియేటర్ కి అద్దె కట్టి విడుదల చేద్దాం అనుకుంటే వారి దగ్గర డబ్బులు అంత అప్పటికే అయిపోయాయి. ఈ సినిమా అలా అలా ఆలస్యం అవుతూ 25 సంవత్సరాల తర్వాత 2003 లో థియేటర్స్ లో విడుదలయ్యింది.  ఈ సినిమా ఆలస్యం అవ్వడంతో మోహన్ లాల్ మెల్లగా వేరే సినిమాల్లో కూడా ప్రయత్నాలు మొదలుపెట్టారు.

ఇక మోహన్ లాల్ గారు తిరగని ఫిల్మ్ స్టూడియో లేదు. ఐతే ఆయనకి 1980 లో మంజల్ విరింజ పొక్కల్ సినిమాలో విలన్ గా చేసే అవకాశం వచ్చింది. ఈ సినిమాని మొత్తం 7 లక్షలతో నిర్మిస్తే అప్పట్లోనే కోటి రూపాయల వరకు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా డైరెక్టర్ కి ఇదే మొదటి సినిమా అవ్వడంతో మోహన్ లాల్ గారు ఈ సినిమా కూడా ఆగిపోకుడుదు అని రోజు దేవుడ్ని మొక్కేవారు. ఈ సినిమాలో ఆయన  విలనిజనికి విపరితమైన పేరు వచ్చింది.

ఈ సినిమా తర్వాత మోహన్ లాల్ గారికి వరసగా అవకాశాలు వచ్చాయి.ఆయన 1981 లో దాదాపుగా 8 సినిమాల్లో విలన్ గా నటించారు. ఇక 1982 లో  14 సినిమాల్లో ఆయన విలన్ గా నటించి అందరిని ఆశ్చర్యపరిచారు.ఇక 1983 లో అయితే ఏకంగా 24 సినిమాల్లో నటించి రికార్డ్ సృష్టించారు. ఈ రికార్డ్ ఇప్పటిదాకా ఎవరు అందుకోలేదు.ఆయన మెల్లగా మలయాళంలో మోస్ట్ వాంటెడ్ విలన్ గా పెరు పొందారు . ఆయన డేట్స్ ఉంటేనే సినిమాలు మొదలుపెట్టివాళ్ళు చాలా మంది నిర్మాతలు.రోజు 3 సినిమాల్లో నటిస్తూ చాలా కష్టపడి ఆయనకి అంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇలా విలన్ గా , సహాయ నటుడుగా ఆయన వరసగా సినిమాల్లో నటిస్తూ వచ్చారు.

ఇక 1984 లో వచ్చిన ఈవాడే తొడగుణ్ణు అనే సినిమాతో ఆయన హీరోగా ఒక రేంజ్ లో గుర్తింపు వచ్చింది మోహన్ లాల్ గారికి . ఆయన కాలేజ్ స్నేహితుడు ప్రియదర్శన్ డైరెక్టర్ గా మారి 1986 లో మోహన్ లాల్ గారిని హీరోగా పెట్టి పూచక్కొరు మూక్కుతి అనే సినిమా తీశారు. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది.1986 సంవత్సరం లో టి పి బలగోపాలన్ యమ్ ఏ సినిమాలో ఆయన నటనకి మంచి పేరు వచ్చింది.అప్పటిదాకా విలన్ గా ఉండే ఆయనకి హీరోగా వరస అవకాశాలు రావడం మొదలయ్యాయి. ఇక ఆయన సినిమా రాజవింటే మాఖాన్ సినిమాతో మోహన్ లాల్ గారికి స్టార్ హీరో స్టేటస్ వచ్చింది.ఈ సినిమాతో ఆయన హీరోగా వెనక్కి తిరిగి చూసుకోలేదు.ఒక్క 1986 లోనే ఆయన హీరోగా , విలన్ గా చేసిన 36 సినిమాలు విడుదల అయ్యాయి.

ఇక ఆయన తర్వాత నటించిన చిత్రం ఇంకొక సంచలనం అని చెప్పాలి. డైరెక్టర్ ప్రియదర్శన్ తీసిన ఈ సినిమా రెండు థియేటర్స్ లో దాదాపుగా 366 రోజులు ఆడింది.ఇది అప్పట్లో పెద్ద సంచలనం అని చెప్పాలి.ఈ సినిమా అప్పటివరకు ఉన్న కేరళ రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టింది. ఈ సినిమా 44 లక్షలతో నిర్మిస్తే విడుదల తర్వాత 3.5 కోట్ల కలెక్షన్స్ ని కొల్లగొట్టింది.ఈ సినిమాని తెలుగులో మోహన్ బాబు గారు అల్లుడు గారు పేరుతో తెలుగులోకి రీమేక్ చేశారు.

1989 లో వచ్చిన కిరీడం సినిమా ఆయన సినీ జీవితంలో ఒక మైలురాయి అని చెప్పొచ్చు. ఇది ఇండియాలో వచ్చిన అత్యంత గొప్ప చిత్రాల్లో ఒకటి అని అందరూ అంటారు. ఈ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన చెంకోల్ 1993 లో విడుదల అయింది. ఈ సినిమా దాదాపుగా 6 భాషల్లో రీమేక్ అయింది. ఇన్ని భాషల్లో రీమేక్ అయిన రెండోవ సినిమా గా కిరీడం సినిమా చరిత్ర సృష్టించింది.

ఇక ఆయన ఒక పక్క కమర్షియల్ సినిమాలు తిస్తూనే ఇంకో పక్క విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకునే సినిమాలు చేశారు.1993 లో వచ్చిన దేవాసురం అనే సినిమా ఆయన కెరీర్ లో ఇంకొక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఈ సినిమా 1990లలో హైయెస్ట్ కలెక్షన్స్ వచ్చిన సినిమాగా రికార్డ్ సృష్టించింది. ఈ సినిమా థియేటర్లు లో 150 రోజులు ఆడింది. అదే సంవత్సరం లో ఈ సినిమాని కుంతి పుత్రుడుగా తెలుగులోకి రీమేక్ చేశారు.ఆ తర్వాత ఆయనకి కొన్ని హిట్స్ మరియు కొన్ని ప్లాప్స్ కూడా వచ్చాయి.

అయితే 1997 లో వచ్చిన గురు సినిమా ఆయన కెరీర్ లో చాలా ప్రత్యేకం అని చెప్పాలి.ఎందుకంటే ఈ సినిమాని ఇండియా తరుపు నుంచి ఆస్కార్స్ పంపిన మొదటి సినిమాగా గురు సినిమాకి చరిత్ర సృష్టించింది. ఇక ఇదే సంవత్సరంలో మోహన్ లాల్ ఒక తమిళ్ సినిమాలో కూడా నటించారు. ఆ సినిమా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఇరువర్.ఈ సినిమా కథ యమ్ జి ఆర్ మరియు కరుణానిధి మధ్య స్నేహం మీద ఉండటం విశేషం. ఈ సినిమాతో మిస్ వరల్డ్ అవార్డ్ వచ్చిన ఐశ్వర్యారాయ్ సినిమాల్లో ప్రవేశించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అవ్వడమే కాకుండా రెండు నేషనల్ అవార్డ్స్ ఇంకా చాలా ఇంటర్నేషనల్ అవార్డ్స్ ని సంపాదించింది.

మోహన్ లాల్ కి ఇంటర్నేషనల్ గా గుర్తింపు తెచ్చిన సినిమా 1999 లో వచ్చిన వనప్రస్థం . ఈ సినిమాలో ఆయన నటనకి అందరూ ఫిదా అయ్యారు. ఈ సినిమా చాలా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో స్క్రీనింగ్ అయింది. అన్ని చోట్లా మోహన్ లాల్ నటనకి అందరూ చప్పట్ల వర్షం కురిపించారు. ఈ సినిమాకి బెస్ట్ ఫిల్మ్ , బెస్ట్ ఎడిటింగ్ , బెస్ట్ యాక్టర్ గా మూడు నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. ఇక 2000 సంవత్సరంలో వచ్చిన నరసింహన్ సినిమా ఆయన కెరీర్ లో ఇంకొక భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా అప్పట్లో రికార్డ్స్ అన్ని తుడిచిపెట్టింది. దాదాపుగా 200 రోజులు ఆడింది .  ఈ సినిమాని తెలుగులో అధిపతి పేరుతో రీమేక్ చేశారు. మోహన్ లాల్ ఈ సినిమా తర్వాత వరసగా ఆయన మాస్ సినిమాలు చేయడం మొదలుపెట్టారు గాని ఆ సినిమాలు మాత్రం అంత గొప్పగా ఆడలేదు.

ఇక 2002 లో మోహన్ లాల్ ఆయన మొదటి బాలీవుడ్ సినిమా చేశారు. ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన కంపెనీ సినిమాలో మోహన్ లాల్ ఒక ముఖ్యమైన పాత్రలో నటించారు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో మోహన్ లాల్ ఐ పి ఎస్ అధికారి పాత్రలో నటించారు.ఈ మధ్యలో ఆయనకి కొన్ని  ప్లాప్స్ వచిన్నప్పటికి 2007 లో వచ్చిన హాల్లో సినిమా హిట్ తో మళ్ళీ ఆయన ఫామ్ లోకి వచ్చారు.

ఇక మోహన్ లాల్ 2011 లో వచ్చిన మల్టి స్టారర్ క్రిస్టియన్ బ్రదర్స్ తో ఇంకొక బ్లాక్ బస్టర్ ని ఆయన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమాలో ఆయనతో పాటు సురేష్ గోపి , దిలీప్ , శరత్ కుమార్ లాంటి హీరోస్ కూడా నటించారు. ఈ సినిమా వరల్డ్ వైడ్ 300 థియేటర్స్ లో విడుదలయ్యింది. ఈ సినిమా ఆ సంవత్సరంలో వచ్చిన హైయెస్ట్ కలెక్ట్ చేసిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.

ఇక 2013 లో వచ్చిన దృశ్యం సినిమా ఒక చరిత్ర అని చెప్పాలి. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా దాదాపుగా 75 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. 42 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసిన ఈ సినిమా మలయాళంలో అల్ టైం హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఈ సినిమా దాదాపుగా అన్ని భాషల్లో  రీమేక్ అయింది. ఇంకొక విశేషం ఏంటి అంటే ఈ సినిమా చైనీస్ భాషలో కూడా రీమేక్ అయింది.

2016వ సంవత్సరం లో ఆయన నటించిన 4 సినిమాలు అన్ని కలిపి 378 కోట్ల కలెక్షన్స్ రాబట్టయి. అందులో ఆయన బిగ్గెస్ట్ హిట్ చిత్ర పులి మురుగన్ , తెలుగులో మొదటి సారిగా చేసిన మనమంతా సినిమా అలాగే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన జనతా గ్యారేజ్  ,అలాగే ప్రియదర్శన్ డైరెక్టర్ గా వచ్చిన ఒప్పం ఇలా ఈ సినిమాలు అన్ని భారీ రేంజ్ లో కలెక్షన్స్ కొల్లగొట్టాయి.

ఆయన కెరీర్ లో ఇంకొక పెద్ద హిట్ 2019 లో వచ్చిన లూసిఫార్. మలయాళ ప్రముఖ హీరో పృథ్వి రాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మలయాళ సిని చరిత్రలో ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది. దాదాపుగా 200 కోట్లకి పైగా ఈ సినిమా కలెక్ట్ చేసి మలయాళం మార్కెట్ ని పెంచింది. ఈ సినిమాని మెగాస్టార్ చిరంజీవి గారు తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు.

ఇక మోహన్ లాల్ దృశ్యం సినిమా రెండవ పార్ట్ గా వచ్చిన దృశ్యం 2 ఈ ఫిబ్రవరి 2021 లో అమెజాన్ ప్రైమ్ లో విడుదలయ్యింది. ఈ సినిమా విమర్శల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. దృశ్యం మరియు దృశ్యం 2 ని ఇండియాలో వచ్చిన బెస్ట్ మూవీ సిరీస్ గా చెప్తారు.

వ్యక్తిగత జీవితం

మోహన్ లాల్ గారు 1988 ఏప్రిల్ 28 న తమిళ నిర్మాత కె బాలాజీ గారి కుమార్తె సుచిత్ర గారితో ఘనంగా పెళ్లి జరిగింది. వీరికి  ప్రాణవ్ మోహన్ లాల్, విస్మయా మోహన్ లాల్ అని ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం ప్రాణవ్ మోహన్ లాల్ మలయాళ సినిమాల్లో హీరోగా నటిస్తున్నారు. మోహన్ లాల్ గారికి రెస్టారెంట్ మరియు సీ ఫుడ్ బిజినెస్ లు చాలా ఉన్నాయి. ఆయనకి ఓషో , జే. కృష్ణమూర్తి పుస్తకాలు చదవడం చాలా ఇష్టం.

అవార్డ్స్

తన 40 సంవత్సరాలు సినీ జీవితంలో మోహన్ లాల్ గారు చాలా అవార్డ్స్ అందుకున్నారు. దాదాపుగా 340 సినిమాల్లో నటించిన మోహన్ లాల్ గారికి 5 నేషనల్ అవార్డ్స్ , 9 కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్  మరియు ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ .

అలాగే మోహన్ లాల్ గారిని భారత ప్రభుత్వం పద్మ శ్రీ , పద్మ భూషణ్ గౌరవలతో సత్కరించింది.

శ్రీ శంకరాచార్య యూనివర్సిటీ  మోహన్ లాల్ గారికి డాక్టరేట్ తో సత్కరించింది.

ఆయనకి టైక్వాండో లో సౌత్ కొరియా నుంచి బ్లాక్ బెల్ట్ కూడా రావడం విశేషం.

ఇండియన్ ఆర్మీచే లెఫ్టినెంట్ కల్నల్ గా నియమితులయ్యారు.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.