
రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత శంకర్ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. దర్శకుడు శంకర్ గురించి చెప్పాలంటే మొదటి నుంచి కూడా ఆయన తన సినిమాలను తమిళంలో రూపొందించి, ఇతర భాషల్లో విడుదలయ్యేలా చూసుకునేవారు.

ఒక పాటను ప్రపంచంలోని ఏడు అద్భుతాల దగ్గర చిత్రీకరించిన దర్శకుడు ఆయన. ఖర్చు విషయంలో ఆయనను నియంత్రించడం చాలా కష్టమైన విషయం. అలాంటి దర్శకుడితో ఈ సినిమాను 'దిల్' రాజు నిర్మిస్తుండటం విశేషం.

దర్శకుడిగా శంకర్ తన వైపు నుంచి అన్ని పనులు చకచకా పూర్తి చేస్తున్నాడట. వచ్చే నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగుకు వెళ్లనుందని అంటున్నారు. ఈ సినిమా షూటింగును జూన్ నాటికి పూర్తి చేసేలా శంకర్ - దిల్ రాజు మాట్లాడుకున్నారట. అంటే చరణ్ నుంచి ఈ దసరాకి 'ఆర్ ఆర్ ఆర్' వస్తే, వచ్చే దసరాకి శంకర్ సినిమా వస్తుందన్న మాట.