
అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రం లో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నారు. ఎర్ర చందనం, స్మగ్లింగ్, నేపథ్యం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

తన పంథా కు భిన్నంగా సుకుమార్ చేసిన రంగస్థలం ప్రయోగం సక్సెస్ అయ్యిందని చెప్పాలి..ఇప్పుడు కూడా అలాంటి రగ్డ్ సినిమా తో రాబోతున్నాడు సుకుమార్..రంగస్థలం లాంటి హిట్ తర్వాత సుకుమార్, అల వైకుంఠపురం లో సినిమా లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి.. వీరి కాంబో లో వస్తున్న మూడో సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

‘పుష్ప’ బన్నీకి 20వ చిత్రం కాగా.. 21వ సినిమాగా కొరటాల శివ దర్శకత్వంలో సినిమా కమిటయ్యాడు. కానీ అనుకోకుండా కొరటాల.. తన తర్వాతి చిత్రాన్ని జూనియర్ ఎన్టీఆర్‌కు కమిటవ్వడంతో బన్నీ సినిమా వెనక్కి వెళ్లింది. ప్రస్తుతానికి అది వాయిదా మాత్రమే పడిందనుకుంటున్నారు. తాజా సమాచారం ప్రకారం బన్నీ నెక్స్ట్ సినిమా మురుగదాస్ దక్కించుకున్నాడట. మురుగదాస్ సైతం బన్నీతో చేయడానికి ముందు నుంచే ఆసక్తితో ఉన్నాడు. కానీ కుదర్లేదు. ఐతే ఎట్టకేలకు వీరి కలయికలో సినిమాకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.