
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టీవీ మరియు థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు చైర్మన్గా ప్రముఖ సినీనటుడు, నిర్మాత శ్రీ పోసాని కృష్ణ మురళి మరియు ప్రముఖ సినీ నటుడు, ఎలక్ట్రానిక్ మీడియా చైర్మన్గా డాక్టర్ ఆలీ నియమితులైనందుకు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి సంతోషిస్తున్నట్లు తెలియజేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్లో వారి సమర్థ నాయకత్వం మరియు పరిపాలనలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చెందుతాయని మరియు ఆయా రంగాలలో ముఖ్యమైన పాత్రలు పోషిస్తారని మేము ఖచ్చితంగా అనుకుంటున్నాము.
శ్రీ పోసాని కృష్ణ మురళి మరియు డాక్టర్ ఆలీ గారికి తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తరపున మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము మరియు వారు తమ పదవుల్లో ఉన్న కాలంలో విజయం సాధించాలని కోరుకుంటున్నాము.
(టి. ప్రసన్న కుమార్) (మోహన్ వడ్లపట్ల)
గౌరవ కార్యదర్శి. గౌరవ కార్యదర్శి