
సినిమా హీరోల కోసం గుళ్ళు కట్టడం కామనే. మన నందమూరి నట సింహం బాలకృష్ణ గారి కోసం కూడా ఒక గుడి నిర్మించారు. అది కూడా 30 లక్షలు ఖర్చుపెట్టి. అయితే బాలయ్య కోసం గుడి కట్టింది అభిమానులు కాదు ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమా బృందం. బోయపాటి దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న 3వ చిత్రం B.B.3. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతోంది. హిట్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కాబట్టి ఈ చిత్ర మీద అంచనాలు భారిగా ఉన్నాయి.

ఇందులో బాలయ్య రెండు క్యారెక్టర్లలో కనిపిస్తారట. చిన్నప్పుడే విడిపోయిన అన్నదమ్ములు వేరు వేరుగా పెరుగుతారు. అయితే అందులో ఒకరు మాత్రం అఘోరా అవుతాడు. ఈ పాత్ర సినిమాకి చాలా కీలకం అని సమాచారం. అయితే ఈ పాత్రలో ఆయన్ను ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలీదు. దానికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. అయితే ఇందు కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రత్యేకించి ఒక గుడి సెట్ వేశారు చిత్ర బృందం. ఈ షెడ్యూల్ అయిపోగానే టీమ్ అంతా బెల్గాం వెళ్ళనున్నారు.

సీనియర్ ఎన్.టి.ఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని మే 28న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ప్రగ్యా జైస్వాల్, పూర్ణలు కథానాయికలుగా నటిస్తుండగా శ్రీకాంత్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి ఎంతో ప్రతీష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. లెజెండ్ సినిమాలో విలన్ గా నటించిన జగపతి బాబు ఈ చిత్రంలో బాలకృష్ణ రైట్ హ్యాండ్ గా కనిపిస్తారని టాక్. మరి ఈ సినిమా మునుపటి సినిమల్లానే హిట్ అయ్యి బలయ్యకి మంచి హిట్ ఇస్తుందో లేదో వేచి చూడాల్సిందే.