
ప్రముఖ డిటెక్టివ్ నవలల రచయిత మధుబాబు గారి గురించి తెలియని వారు ఉండరు. షెర్లాక్ హోమ్స్ తరహాలో షాడో అనే డిటెక్టివ్ తనకు వచ్చిన కేసుల్ని ఎలా సాల్వ్ చేసాడనే విషయాన్ని ఆయన కథా వస్తువుగా తీసుకుని నవలలు రాసారు. ఈ నవలలు అప్పట్లో తెలుగు సాహిత్య రంగంలో పెను తుఫాను సృష్టించాయి. ఈ తరం వారికి వీటి గురించి పెద్దగా తెలియకపోయినా అప్పట్లో ఈ నవలల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసేవారు అభిమానులు.
Madhubabu's "shadow" as an audiobook on @gaana nw..!! #shadow #audiobook pic.twitter.com/aXWxKMidcX
— RJhemant (@mirchihemant) April 29, 2021
ఆ మధ్య జూనియర్ ఎన్టీఆర్ ఒక కథను సినిమా తీయనున్నారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ప్రముఖ నిర్మాత వెబ్ సిరీస్ తీస్తానని, ఆ తర్వాత సినిమా తెరకెక్కిస్తామని ప్రకటించారు. కాలక్రమేనా దాని గురించి అందరూ మర్చిపోయారు కూడా. అయితే ఇప్పుడు ప్రముఖ రేడియో జాకీ హేమంత్ ఆ పని చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు హేమంత్ తన సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశారు. మధు బాబు పక్కన కూర్చుని ఒక వీడియో బైట్ కూడా ఇప్పించారు. హేమంత్ త్వరలోనే ఇవన్నీ గానా శ్రోతల ముందుకు వస్తాయని ప్రకటించాడు.

ఈ మధ్య కాలంలో ఎవరికీ పుస్తకాలు చదివే ఓపిక ఉండటం లేదు. అందులోను చాలా మందికి తెలుగు సరిగ్గా చదవటం కూడా రావట్లేదు. వీటిని దృష్టిలో ఉంచుకుని హేమంత్ ఆ నవలన్నిటినీ ఆడియో బుక్స్ రూపంలో మన ముందుకి తీసుకువస్తున్నారు. ఈ ఆడియో ఫార్మాట్స్ త్వరలోనే గానా మ్యూజిక్ యాప్ లో విడుదల అవనున్నాయి.