తెలుగు ఓటీటీ మాధ‌మ్య‌మం ‘ఆహా’లో స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ మారుతి షో ర‌న్న‌ర్‌గా రూపొందుతోన్న స‌రికొత్త వెబ్ సిరీస్‌ ‘త్రీ రోజెస్’ .. ఫస్ట్ పోస్ట‌ర్‌ విడుదల!!

తెలుగు ప్రేక్ష‌కులకు తిరుగులేని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందిస్తున్న వారి హృద‌యాల్లో చెర‌గ‌ని స్థానాన్ని ద‌క్కించుకున్న హండ్రెడ్ ప‌ర్సెంట్ తెలుగు ఓటీటీ మాధ‌మ్యం ‘ఆహా’. ఇందులో స‌రికొత్త ఎగ్జ‌యిటింగ్ వెబ్ సిరీస్ ‘3 రోజెస్’ ఆడియెన్స్‌ను అల‌రించ‌నుంది. భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, ప్ర‌తిరోజూ పండ‌గే, ఈరోజుల్లో, మ‌హానుభావుడు వంటి సూప‌ర్ డూప‌ర్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు మారుతి ఈ సిరీస్‌కు షో ర‌న్న‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. డిజిట‌ల్ మాధ్య‌మంలో ముగ్గురు హీరోయిన్స్ న‌టిస్తోన్న తొలి వెబ్ సిరీస్ ఇదే. రవి నంబూరి రాసిన ఈ సిరీస్‌ను మ్యాగీ డైరెక్ట్ చేశారు. విజ‌య్ దేవ‌కొండ ట్యాక్సీవాలా చిత్రాన్ని నిర్మించిన ఎస్‌.కె.ఎన్ యాక్ష‌న్ క‌ట్ మూవీస్ ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై ‘3 రోజెస్’ మూవీని నిర్మిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన ఫ‌స్ట్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఇందులో న‌టిస్తున్న ముగ్గురు హీరోయిన్స్ బార్‌లో క‌నిపిస్తున్నారు.


ఈ పోస్ట‌ర్‌కు బ్లూమింగ్ సూన్ అనే ట్యాగ్‌లైన్‌ను పెట్టారు. ఇందులో న‌టించే ముగ్గురు హీరోయిన్స్ ఎవ‌రా అనే ఆస‌క్తి అందరిలోనూ క‌లిగింది. పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే ప్రొడ‌క్ష‌న్  డిజైన్‌, క‌ల‌ర్‌ఫుల్ కాస్ట్యూమ్స్‌తో అంద‌రి అటెన్ష‌న్ సంపాదించుకుంది. అస‌లు 3 రోజెస్ సిరీస్‌లో ఎవ‌రు న‌టిస్తార‌నే క్యూరియాసిటీ అందరిలో నెల‌కొంది.
2020లో జ‌రిగిన ఆహా ప్ర‌థ‌మ వార్షికోత్సం జ‌రిగినప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చెబుతూ ఆహా కోసం మారుతి ఓ షో చేయ‌బోతున్నార‌ని తెలియ‌జేశారు. ఈరోజుల్లో, ప్రేమ‌క‌థా చిత్ర‌మ్‌, ప్ర‌తిరోజూ పండ‌గే, భ‌లే భ‌లే మ‌గాడివోయ్, మ‌హానుభావుడు వంటి క‌మ‌ర్షియ‌ల్ చిత్రాలు ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌రంగానూ ప్రేక్ష‌కుల‌ను అద్భుతంగా ఆక‌ట్టుకున్నాయి. డిఫరెంట్ ఎంట‌ర్‌టైన్మెంట్‌తో ప్రేక్ష‌కుల‌ను న‌వ్వించే దర్శ‌కుడిగా మారుతికి టాలీవుడ్‌లో ఓ పేరుంది. త‌న‌దైన స్టైల్లో ఇప్పుడు మారుతి షో ర‌న్న‌ర్‌గా చేస్తున్న త్రీ రోజెస్‌లో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఫ‌న్ రైడ‌ర్‌గా ప్రేక్ష‌కుల‌ను ఈ సిరీస్ ఆక‌ట్టుకోనుంది. బాల్‌రెడ్డి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఎస్‌.బి.ఉద్ధ‌వ్ ఎడిటింగ్ చేస్తున్న ఈ చిత్రానికి ఉయ్యాలా జంపాల ఫేమ్ ఎం.ఆర్‌.స‌న్ని సంగీతాన్ని అందిస్తున్నారు.


రీసెంట్‌గా ఆహా, ఒక‌దాని త‌ర్వాత ఒకొక్క‌టిగా విజ‌య‌వంత‌మైన‌ వెబ్ సిరీస్‌ల‌ను అందిస్తుంది. కుడిఎడ‌మైతే, త‌ర‌గ‌త‌దాటి, ది బేక‌ర్ అండ్ ది బ్యూటీ  సిరీస్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డ‌మే కాదు, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు కూడా అందుకుంటున్నాయి. ఈ మూడు వెబ్ సిరీస్‌లు ఒక్కొక్క జోన‌ర్‌కు చెందిన‌వి. ఒక‌టి సైఫై థ్రిల్ల‌ర్ కాగా, మ‌రొక‌టి టీనేజ్ డ్రామా, మ‌రొక‌టి మ‌న జీవితాల‌ను ద‌గ్గ‌ర‌గా రూపొందిన రోమ్ కామ్‌. రానున్న కాలంలో ఆహా త‌న ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌రంగా అద్భుత‌మైన విందు భోజ‌నాన్ని అందించ‌నుంది.
2021 ఏడాదిలో ‘ఆహా’ ... క్రాక్‌, ఎస్.ఆర్.కళ్యాణ మండపం, వాహనములు నిలుపరాదు, సూపర్ డీలక్స్,  లెవన్త్ అవర్, జాంబిరెడ్డి, చావు క‌బురు చ‌ల్ల‌గా, నాంది, ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్‌, నీడ‌, కాలా, ఆహా భోజ‌నంబు, వ‌న్‌, సూప‌ర్ డీల‌క్స్‌, చ‌తుర్ ముఖం, కుడి ఎడ‌మైతే, త‌ర‌గ‌తిగ‌ది దాటి, ది బేక‌ర్ అంద్ ది బ్యూటీ, మ‌హా గ‌ణేశ‌, ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు సినిమాలు, వెబ్ షోస్‌ల‌తో ప్ర‌తి ఒక తెలుగువారి ఇంట తిరుగులేని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందిస్తూ భాగ‌మైంది.

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.