
సొట్ట బుగ్గల సుందరి తాప్సి పన్ను తన ట్విట్టర్, ఇన్స్టా ఖాతాల్లో చాలా యాక్టివ్ గా వుంటుంది. టాలీవుడ్ లో ఏంట్రీ ఇచ్చి బాలీవుడ్ లో సెటిల్ అయ్యింది. ప్రస్తుతం తాప్సి బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఈ ఢిల్లీ భామ ఎప్పటికప్పుడు తను చేసిన సినిమాలు, చేయబోయె సినిమాలు, ఫిట్ నెస్ సంబంధించిన ఫోటోలు, సోషల్ అవేర్ నెస్ గురించి పోస్ట్ లు పెడుతూ మంచి విషయాలు తన అభిమానులతో చర్చిస్తూ ఉంటుంది. తాజాగా తాప్సి పన్ను తన ఇన్స్టాగ్రామ్ లో ఒక ఫోటో పెట్టింది. ఆ ఫోటో లో తాప్సి పన్ను యోగా ఆసనంలో ఉన్న పోజ్ తో దర్శనమిచ్చింది. అ ఫోటో షేర్ చేస్తూ ‘బో అండ్ యారో’ అంటూ పోస్ట్ పెట్టింది. అంటే తను వేసిన ఆసనం పేరు తెలుగులో ధనురాసనం. యోగాలో మొత్తం 84 రకాల ఆసనాలు ఉన్నాయి. ఈ 84 ఆసనాల్లో 12 బేసిక్ అండ్ ముఖ్యమైన ఆసనాలున్నాయి. ఈ ముఖ్యమైన ఆసనాల్లో ధనురాసనం కూడా ఒకటి. ఈ ఆసనాన్ని బోర్లా పడుకుని రెండు కాళ్ళని చేతులతో పట్టుకుని లాగుతూ శరీరం ముందు వెనక భాగాలు పైకి లేపి పొట్ట ఆధారం చేసుకుని ఉండాలి. ఇలా ఈ ఆసనం ఐదు నుండి ఆరు సార్లు చేయడం వల్ల పొట్ట మీద బరువు పడి పొట్ట చుట్టు ఉన్న కొవ్వు కరగడానికి ఉపయోగ పడుతుంది. అలాగే పొట్ట చుట్టు ఉన్న ఆర్గాన్స్ కూడా ఆరోగ్యంగా తయారవుతాయి. తాప్సి ధనురాసనం వేస్తూ విల్లు వదులుతున్న బాణంలా శరీరాన్ని వంచింది. తాప్సీ షేర్ చేసిన ఈ ఫోటోని అభిమానులు లైకులతో తాప్సి ఇన్స్టాని నింపేసారు.