
మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలతో అరెస్ట్ అయిన ఫన్ బకెట్ భార్గవ్ గురించిన విషయాలు సంచలనంగా మారాయి. సదరు అమ్మాయి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భార్గవ్‌పై ఈ నెల 16న పెందుర్తి పోలీస్ స్టేషన్‌లో ‘దిశ’, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం పోలీసుల విచారణలో తేలిన కొన్ని విషయాలు సెన్సేషన్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వరుసపెట్టి అతని వీడియోల్లో నటించిన అమ్మాయిలు కెమెరా ముందుకొస్తున్నారు. రీసెంట్ గా ఓ మై గాడ్ నిత్య కెమెరా ముందుకి వచ్చి అతని గురించి చెప్పిన విషయం తెలిసిందే. అలాగే ఆ మైనర్ బాలిక ఆమె అని వస్తున్న వదంతులను కూడా ఆమె కొట్టి పారేసింది.

ఇక ఇదే కోవలో సయ్యద్ సుమయ కెమెరా మందుకి వచ్చి అతని నిజస్వరూపం బయటపెట్టింది. అతడితో పని చేసిన అమ్మాయిల వల్లే భార్గవ్‌కు పేరొచ్చినప్పటికీ వారిని కొంచెం కూడా గౌరవించడని, అతనో వుమెనైజర్ అంటూ బాంబ్ పేల్చింది ఆ అమ్మాయి. కెమెరా ముందు ఒకలా కనిపించే భార్గవ్.. తెరవెనుక మరోలా ప్రవర్తిస్తాడంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అతను అలా చాలా మంది అమ్మాయిలతో మిస్ బిహేవ్ చేసాడని ఆమె పేర్కొంది.
ఈ విషయమై ఆమె ప్రేక్షకులతో మాట్లాడుతూ మీరు ఏమైనా అడగాలనుకుంటే అడోగొచ్చు అని ఆమె కోరింది. వారు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానాలు చెప్పింది. ఆ అమ్మాయి ఎవరో చెప్పాలి అంటూ ఒకతను అడగగా నేను చెప్పను ఒకవేళ మీలో ఎవరికైనా తెలిసినా చెప్పకండి, ఆ అమ్మాయి ఫ్యూచర్ గురించి ఆలోచించండి అంటూ సమాధానం ఇచ్చింది. అతని గురించి ముందే తెలిసినా తన తప్పు తెలుసుకుంటాడని వదిలేసానని ఆమె చెప్పింది.