
బస్ కండక్టర్ నుంచి సూపర్ స్టార్ దాకా ఎదిగిన రజినీకాంత్ గారు ఆయన సినిమాలతో సౌత్ సినిమా మార్కెట్ ని చాలా పెంచారు. వరసగా భారీ సినిమాలని చేస్తూ ఈ వయసులో కూడా చలాకీగా ఉండే రజనీకాంత్ గారు ఈరోజు ఘనంగా పుట్టినరోజు జరుపుకుంటున్నారు.అయితే రజిని పుట్టినరోజును ఆయన కన్నా ఆయన అభిమానులు ఎక్కువ జరుపుకుంటారు.ఈ 70వ పుట్టిన రోజు రజినీకాంత్ గారికి చాలా ముఖ్యమైనది . ఎందుకంటే ఆయన త్వరలోనే రాజకీయా పార్టీ ని ప్రకటించబోతున్నారు. ఇన్ని రోజులు సినిమాల్లో హీరోగా ఒక రేంజ్ లో క్రేజ్ తెచ్చుకున్న రజినీకాంత్ గారు ఇక ఇప్పటి నుంచి రాజకీయాల్లో కూడా హీరో అవ్వాలి అనుకుంటున్నారు. వచ్చే ఏడాది నుంచి ఆయన రాజకీయ పార్టీ చురుకుగా రాజకీయాల్లో పాల్గొనబోతుంది.
ఇక ఆయన సినిమాల విషయానికి వస్తే రజిని ప్రస్తుతం మాస్ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తున్న 'అన్నత్తే'లో నటిస్తున్నారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కనున్న 'అన్నత్తే' షూటింగ్ డిసెంబర్ 14 నుంచి మొదలు కాబోతుందని తెలుస్తోంది. సూపర్ స్టార్ స్టామినాకు ఏమాత్రం తగ్గని విధంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో నయనతార, కీర్తి సురేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే, సీనియర్ హీరోయిన్ మీనా, కుష్బూ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీలైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేసి, వచ్చే ఏడాది ప్రథమార్ధంలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.