Superstar @rajinikanth Has Named His New Political Party As 'Makkal Sevai Katchi' With #Autorickshaw As It's Symbol. 🛺#MakkalSevaiKatchi pic.twitter.com/n4U50Vp2Fz
— BARaju (@baraju_SuperHit) December 15, 2020
సూపర్ స్టార్ రజీనికాంత్ రాజకీయాల్లోకి వస్తున్న విషయం తెలీసిందే. ఇటీవలే తను పార్టీ పెట్టి వివరాలు తెలిపాడు. తాజాగా రజీనీకాంత్ తన పార్టీ గుర్తును, పేరును రివీల్ చేశారు. రజినీకాంత్ పార్టీకి 'మక్కల్ సేవై కర్చీ' (ప్రజాసేవా పార్టీ) అని పేరు పెట్టినట్టు తెలిసింది. అలాగే తన పార్టీకి ఎన్నికల గుర్తుగా 'ఆటో'ను ఎంచుకున్నట్టు సమాచారం. రజనీకాంత్ తో 'ఆటోరిక్షా'కు అవినాభావ సంబంధం ఉంది తన కరీర్ లో మైలు రాయిగా నిలిచిన భాష సినిమాలో ఆటోడ్రైవర్ గా కనిపించాడు. ఆ సినిమా ఎన్ని రికార్డులు సృష్టించిందో అందరికీ తెలిసిన విషయమే. ఆటోను రజీనీ తన సెంటిమెంట్ గా భావించాడు. ఇదిలా ఉండగా రజినీకాంత్ మొదట తన ఎన్నికల గుర్తుగా 'బాబా లోగో'ను అడిగారని. కానీ ఎన్నికల సంఘం దాన్ని నిరాకరించిందని సమాచారం. ఇక సైకిల్ ను ఎన్నికల గుర్తుగా అనుకొని చివరకు తనకు సెంటిమెంట్ అయిన 'ఆటో'ను ఎంచుకున్నారు తలైవ రజినీకాంత్ తన రాజకీయ పార్టీ పేరు 'మక్కల్ సేవై కర్చి'గా తన పార్టీ ఎన్నికల గుర్తుగా 'ఆటో రిక్షా'ను పోల్ సింబల్ గా కేటాయించాలని కోరుతూ ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా (ఇ.సి.ఐ)కి లేఖ రాశారు. రజీనికాంత్ పార్టీ సింబల్ ఆటో గుర్తు , పార్టీ పేరు మక్కల్ సేవై కర్చి ఖరారైనట్టు బి.ఎ రాజు తన ట్విట్టర్ లో ఈ విషయాన్ని చెప్పకొచ్చారు.