
కొంచెం విరామం తర్వాత మంచు విష్ణు ఒక భారీ బడ్జెట్ చిత్రంతో మన ముందు రాబోతున్నాడు. మోసగాళ్ళు పేరుతో వస్తున్న ఈ చిత్రం టీజర్ కూడా ఈ మధ్యనే విడుదలైంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి పవర్ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. అయితే దీపావళి సందర్భంగా మూవీ టీం ఆయన పాత్రకు సంబంధించి టీజర్ ని విడుదల చేసింది. ఇందులో నా జోన్ లో తప్పు చేసిన ఎవరైనా డేంజర్ జోన్ లో ఉన్నట్టే అని డైలాగ్ తో టీజర్ లో సునీల్ శెట్టి పవర్ ఫుల్ గా కనిపించారు. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హాలీవుడ్ దర్శకుడు జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహిస్తున్నాడు. రూహీ సింగ్, కాజల్ అగర్వాల్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.కాజల్ అగర్వాల్ ఇందులో మంచు విష్ణుకు సోదరిగా కనిపిస్తుండటం విశేషం. నవీన్ చంద్ర, నవదీప్ ప్రాధాన్య పాత్రల్లో నటిస్తున్నారు. 24 ఫిలిం ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై మంచు విష్ణు నిర్మిస్తున్నారు.
Of all the people, I had to mess with the toughest cop in town. Meet ACP Kumar @SunielVShetty #Mosagallu @MsKajalAggarwal. https://t.co/wmI1mfKTjo pic.twitter.com/s9hC8C3WBC
— Vishnu Manchu (@iVishnuManchu) November 13, 2020