కమల్ కోసం విలన్ గా రంగంలోకి దిగుతున్న స్టార్ హీరో..!!

విశ్వనటుడు కమల్ హాసన్ రాజకీయాల్లోకి వచ్చి ఇటీవలే జరిగిన ఎన్నికల్లో ఓడిపోయిన విషయం తెలిసిందే.. . నటుడిగా ఎన్నో గొప్ప గొప్ప పాత్రలు చేసిన కమలహాసన్ రాజకీయాల్లో కూడా అదేవిధంగా ఎన్నో శిఖరాలు అధిష్టించాలని ప్రేక్షకులు కోరుకోగా ఆదిలోనే హంసపాదు అన్నట్లు కమల్ కి మొదట్లోనే ఓటమి పలకరించింది. ప్రస్తుతం అయన భారతీయుడు 2 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే..

దాదాపు ఇరవైఏళ్ళ క్రితం వచ్చిన సినిమా కి ఇప్పుడు సీక్వెల్ చేయడం విశేషం..  శంకర్ ఈ సినిమా ని తనదైన స్టైల్ లో తెరకెక్కించబోతున్నాడని అంటున్నారు..  ఈ సినిమా ను ఏ ముహూర్తాన మొదలుపెట్టాడొ తెలీదు కానీ ఆదినుంచి ఈ సినిమాకి అన్ని అడ్డంకులు వస్తున్నాయి.. ప్రస్తుతం మళ్ళీ ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టబోతున్నాడని తెలుస్తుంది..

ఇదిలా ఉంటే కమల్ వికారం అనే సినిమాలోనూ నటిస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా లో విలన్ గా విజయ్ సేతుపతి చేయబోతున్నారట.. తాజాగా ఆయన ఈ ప్రాజెక్టుపై సైన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇది కమల్ సొంత బ్యానర్లో నిర్మితమవుతోంది. కమల్ తనని ఎదుర్కునే పాత్రకి విజయ్ సేతుపతిని ఎంపిక చేశారంటే, నటుడిగా ఆయన ఏ స్థాయికి వెళ్లాడనేది అర్థం చేసుకోవచ్చు.

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.