
విక్టరీ వెంకటేష్ 75వ మైల్ స్టోన్ మూవీ ‘సైంధవ్’. హిట్‌వర్స్ ఫేమ్ శైలేష్ కొలను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వెంకట్ బోయనపల్లి భారీ కాన్వాస్‌పై అత్యున్నత స్థాయి నిర్మాణం, సాంకేతిక ప్రమాణాలతో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
గణేష్ చతుర్థి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ ఒక స్పెషల్ పోస్టర్ ని విడుదల చేశారు. ఈ పోస్టర్ లో వెంకటేష్, శ్రద్ధా శ్రీనాథ్, బేబీ సారా.. సరదాగా ఫ్యామిలీ టైం ని గడుపుతూ అనందంగా కనిపించారు.
వెంకటేష్ 75వ మైల్ స్టోన్ మూవీగా రూపొందుతున్న ‘సైంధవ్’ని మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకొని ఎక్కడా రాజీపడకుండా నిర్మిస్తున్నారు. ఇప్పటివరకూ విడుదలైన ‘సైంధవ్’ ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఎస్ మణికందన్ కెమెరామెన్ గా, గ్యారీ బిహెచ్ ఎడిటర్ గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి కిషోర్ తాళ్లూరు సహ నిర్మాత.
పాన్ ఇండియా మూవీ సైంధవ్ అన్ని దక్షిణాది భాషలు, హిందీలో డిసెంబర్ 22న క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది.
తారాగణం: వెంకటేష్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జెర్మియా, సారా
సాంకేతిక విభాగం :
రచన, దర్శకత్వం : శైలేష్ కొలను
నిర్మాత: వెంకట్ బోయనపల్లి
బ్యానర్: నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్
సంగీతం: సంతోష్ నారాయణ్
సహ నిర్మాత: కిషోర్ తాళ్లూరు
డీవోపీ: ఎస్.మణికందన్
ఎడిటర్: గ్యారీ బిహెచ్
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
VFX సూపర్‌వైజర్: ప్రవీణ్ ఘంటా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్ వెంకటరత్నం (వెంకట్)
పీఆర్వో : వంశీ-శేఖర్
పబ్లిసిటీ డిజైనర్: అనిల్ & భాను
మార్కెటింగ్: CZONE డిజిటల్ నెట్‌వర్క్
మాస్ మహారాజా రవితేజ, వంశీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘టైగర్ నాగేశ్వరరావు’ సెకండ్ సింగిల్ వీడు సెప్టెంబర్ 21న విడుదల
పాన్ ఇండియా మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’ మేకర్స్ మ్యూజిక్ జర్నీని ఎక్ దమ్ అనే ఎలక్ట్రిఫైయింగ్ నంబర్‌తో ప్రారంభించారు. ఈ పాట సూపర్ హిట్ అయ్యింది. టైగర్ నాగేశ్వరరావులోని రొమాంటిక్ యాంగిల్‌ని ఈ పాట చూపించింది. ఇప్పుడు టైగర్ మ్యాసీ సైడ్ ని చూపించాల్సిన సమయం వచ్చింది. సెప్టెంబరు 21న విడుదల కానున్న రెండవ పాట వీడు లో టైగర్ నాగేశ్వరరావు ఫెరోషియస్ అవతార్ ని చూపించనున్నారు.
పోస్టర్ లో టైగర్ నాగేశ్వరరావుగా రవితేజ ఇంటెన్స్, ఫెరోషియస్ గా నడుచుకుంటూ కనిపించారు. అతను బీడీ తాగుతున్నప్పుడు, వెనుక ఉన్న వ్యక్తులు క్రేజీగా వైల్డ్ డ్యాన్స్ లు చేయడం కనిపిస్తోంది. ఈ పోస్టర్ టైగర్ నాగేశ్వరరావుకి తగినంత ఎలివేషన్ ఇస్తుంది, సెప్టెంబర్ 21న మనం ఎలాంటి మాసీవ్ నెంబర్ ని చూడబోతున్నామో ఊహించుకోవచ్చు.
ఈ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కి వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. వరుసగా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 చిత్రాలను రూపొందించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నూపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ ఆర్ మదీ ఐఎస్‌సి, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్. శ్రీకాంత్ విస్సా డైలాగ్ రైటర్ కాగా, మయాంక్ సింఘానియా సహ నిర్మాత.
దసరా కానుకగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 20న విడుదల చేస్తున్నారు.
తారాగణం: రవితేజ, నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్, రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్ తదితరులు
సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: వంశీ
నిర్మాత: అభిషేక్ అగర్వాల్
బ్యానర్: అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్
సమర్పణ: తేజ్ నారాయణ్ అగర్వాల్
సహ నిర్మాత: మయాంక్ సింఘానియా
డైలాగ్స్: శ్రీకాంత్ విస్సా
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
డీవోపీ: ఆర్ మదీ
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
పీఆర్వో: వంశీ-శేఖర్
కల్ట్ మోడ్‌ని యాక్టివేట్ చేసి మ్యాడ్ మేనియాను ఎంజాయ్ చేయండి- ఉస్తాద్ రామ్ పోతినేని మాసీవ్ ఎనర్జీ & సిజ్లింగ్ ఊర్వశి రౌతేలా రాంపేజ్ ‘స్కంద’ నుండి కల్ట్ మామా సాంగ్ విడుదల
బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ రామ్ పోతినేని క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘స్కంద’-ది ఎటాకర్.. గ్లింప్స్, టీజర్, ట్రైలర్, పాటలు.. ఇలా ప్రతి ప్రమోషనల్ కంటెంట్ అంచనాలను పెంచింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ లో డోస్ పెంచారు. ఈ రోజు, గణేష్ చతుర్థి సందర్భంగా, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కల్ట్ మామా పాటను విడుదల చేసారు.
కల్ట్ మామా ని సాలిడ్ బీట్‌లతో హైలీ మాస్ ఎనర్జిటిక్ పాటగా కంపోజ్ చేశారు ఎస్ఎస్ తమన్. ట్యూన్‌కి కమాండింగ్ బేస్ ఉంది. అనంత శ్రీరామ్ సాహిత్యం హీరో సత్తాను చాటింది. పాట రిథమ్, ఆర్కెస్ట్రా మాస్ ఎనర్జీని నింపాయి.
కల్ట్ మామాని రమ్య బెహెరా, మహాతో కలిసి హేమ చంద్ర పాడారు. వారి వోకల్స్ పాట ఎనర్జీని పెంచాయి. ఈ పాట మన కల్ట్ మోడ్‌ని యాక్టివేట్ చేసి మ్యాడ్ మేనియాను ఎంజాయ్ చేసేలా వుంది. రామ్ పోతినేని మాసీవ్ ఎనర్జీ బిగ్గెస్ట్ స్ట్రెంత్. రామ్ పూర్తిగా రగ్గడ్ అవతార్‌లో కనిపించారు. అతని ఎక్స్ టార్డినరీ డ్యాన్స్ మూమెంట్స్ విజువల్స్‌కు అందాన్ని జోడించాయి. ఊర్వశి రౌతేలా సిజ్లింగ్ షో మరో ఆకర్షణ.
ఈ సాంగ్ తన చుట్టూ ఉన్న హైప్‌ని అందుకొని సినిమాపై ఉన్న అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లింది.
శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం రామ్‌కు ఎక్స్ పెన్సీవ్ మూవీ. శ్రీలీల కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సాయి మంజ్రేకర్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
సంతోష్ డిటాకే సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సౌత్, పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. ఎడిటర్ తమ్మిరాజు.
స్కంద సెప్టెంబర్ 28న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా విడుదల కానుంది.
తారాగణం: రామ్ పోతినేని, శ్రీలీల, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, గౌతమి, ప్రిన్స్, తదితరులు
సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: బోయపాటి శ్రీను
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
బ్యానర్: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్
ప్రెజెంట్స్: జీ స్టూడియోస్ సౌత్, పవన్ కుమార్
సంగీతం: ఎస్ఎస్ థమన్
డీవోపీ: సంతోష్ డిటాకే
ఎడిటింగ్: తమ్మిరాజు
పీఆర్వో: వంశీ-శేఖర్, పులగం చిన్నారాయణ
రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా, భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, టి సిరీస్, భద్రకాళి పిక్చర్స్ ‘యానిమల్’ టీజర్ సెప్టెంబర్ 28న విడుదల
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న మాస్టర్ పీస్ 'యానిమల్'.. మోస్ట్ ఎవైటింగ్ ఆడ్రినలిన్, ఎక్సయిటింగ్ పవర్ ఫుల్ టీజర్ సెప్టెంబరు 28న విడుదల కానుంది. రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న చిత్రం బ్రాండ్ న్యూ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. పోస్టర్ పర్ఫెక్ట్ గా వుంది. ఇది పోస్టర్ మాత్రమే కాదు.. రణబీర్ కపూర్ పాత్ర, సినిమా ఎంత పవర్ ఫుల్ గా ఇంటెన్స్ గా వుంటుందో సూచిస్తోంది.
'యానిమల్' భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇద్దరు దిగ్గజాలు..వెర్సటైల్ యాక్టర్ రణబీర్ కపూర్, విజనరీ రచయిత-దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ని కలిపే ఒక క్లాసిక్ సాగా. ఈ గ్రాండ్ వెంచర్ వెనుక ప్రముఖ నిర్మాత భూషణ్ కుమార్ వున్నారు. అనిల్ కపూర్, రష్మిక మందన, బాబీ డియోల్, త్రిప్తి డిమ్రీ.. భారీతారాగణం ఈ సినిమాటిక్ మాస్టర్‌పీస్ లో వుంది. ప్రేక్షకులకు విజువల్, ఎమోషనల్ ట్రీట్ ని అందించనుంది.
యానిమల్‌ను భూషణ్ కుమార్ & క్రిషన్ కుమార్‌ల T-సిరీస్, మురాద్ ఖేతాని సినీ1 స్టూడియోస్ , ప్రణయ్ రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్ నిర్మించాయి. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1 డిసెంబర్ 2023న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం - 5 భాషల్లో విడుదల కానుంది.
తారాగణం: రణబీర్ కపూర్, అనిల్ కపూర్, రష్మిక మందన్న
సాంకేతిక విభాగం:
దర్శకత్వం: సందీప్ రెడ్డి వంగా
నిర్మాతలు: భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా
బ్యానర్లు: టి సిరీస్, భద్రకాళి పిక్చర్స్
పీఆర్వో: వంశీ-శేఖర్
అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు తెలియజేసిన 'హను-మాన్' టీం, బ్రాండ్ న్యూ పోస్టర్‌తో ప్రమోషన్స్ కిక్‌స్టార్ట్
క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్నతొలి చిత్రం 'హను-మాన్'. ట్యాలెంటెడ్ హీరో తేజ సజ్జా కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి హై-ఎండ్ వీఎఫ్ఎక్స్ వుండటంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు బెస్ట్ సినిమాటిక్ అనుభూతిని అందించడానికి టీమ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. టీజర్‌కి అన్ని భాషల్లోనూ అద్బుతమైన రెస్పాన్స్ రావడంతో వారు మరింత జాగ్రత్త తీసుకుంటున్నారు.
ఇదీలావుండగా హను-మాన్ టీమ్ అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు తెలియజేసింది. పండుగ సందడితో నిండిన పర్ఫెక్ట్ పోస్టర్‌ను విడుదల చేయడం ద్వారా మేకర్స్ ప్రమోషన్‌లను ప్రారంభించారు. పోస్టర్ లో తేజ సజ్జా ట్రెడిషినల్ అవతార్లో కనిపించారు. తన చుట్టూ భారీ గుంపుతో గణేష్ చతుర్థి పండుగను జరుపుకుంటున్నారు. మేకర్స్ త్వరలో కొన్ని ఎక్సయిటింగ్ అప్‌డేట్‌లతో రానున్నారు.
హను-మాన్ తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్ , జపనీస్‌తో సహా పలు భారతీయ భాషలలో పాన్ వరల్డ్ విడుదల కానుంది.
హను-మాన్ "అంజనాద్రి" ఊహాత్మక ప్రదేశంలో సెటప్ చేయబడింది. సినిమా కాన్సెప్ట్ యూనివర్సల్‌గా ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా మంచి విజయం సాధించే అవకాశం ఉంది.
ఈ చిత్రంలో తేజ సజ్జ సరసన అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తుండగా, వినయ్ రాయ్ విలన్‌గా, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
శ్రీమతి చైతన్య సమర్పణలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా అస్రిన్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్‌గా వెంకట్ కుమార్ జెట్టి, అసోసియేట్ ప్రొడ్యూసర్‌గా కుశాల్ రెడ్డి వ్యవహరిస్తున్నారు.
ఈ అద్భుతమైన చిత్రానికి శివేంద్ర సినిమాటోగ్రఫీ అందించగా.. గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ త్రయం సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీనాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైనర్.
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం జనవరి 12, 2024న సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
తారాగణం: తేజ సజ్జా, అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను, సత్య, రాజ్ దీపక్ శెట్టి తదితరులు
సాంకేతిక విభాగం:
రచన & దర్శకత్వం: ప్రశాంత్ వర్మ
నిర్మాత: కె నిరంజన్ రెడ్డి
బ్యానర్: ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్
సమర్పణ: శ్రీమతి చైతన్య
స్క్రీన్‌ప్లే: స్క్రిప్ట్స్‌విల్లే
డీవోపీ: దాశరధి శివేంద్ర
సంగీత దర్శకులు: గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్
ఎడిటర్: సాయిబాబు తలారి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అస్రిన్ రెడ్డి
లైన్ ప్రొడ్యూసర్: వెంకట్ కుమార్ జెట్టి
అసోసియేట్ ప్రొడ్యూసర్: కుశాల్ రెడ్డి, పుష్పక్ రెడ్డి
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీనాగేంద్ర తంగాల
పీఆర్వో: వంశీ-శేఖర్
కాస్ట్యూమ్ డిజైనర్: లంకా సంతోషి