సందడిగా సాగిన బేబీ టీజర్‌ విడుదల కార్యక్రమం!!

ఆనంద్‌ దేవరకొండ, విరాజ్‌ అశ్విన్‌, వైష్ణవి చైతన్య నటిస్తున్న కొత్త
సినిమా బేబీ. ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్‍ పతాకంపై ఎస్కేఎన్‌,
దర్శకుడు మారుతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సాయి రాజేష్‌ దర్శకత్వం
వహిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదలకు
సిద్ధమవుతోంది. తాజాగా బేబీ చిత్ర టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకులు అనిల్‌ రావిపూడి, హరీష్‌ శంకర్‌, వశిష్ట,
వెంకటేష్‌ మహా, వీఐ ఆనంద్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా

దర్శకుడు సాయి రాజేష్‌ మాట్లాడుతూ...తమిళనాడులోని ఓ ప్రాంతంలో జరిగిన
వాస్తవ సంఘటనను స్ఫూర్తిగా తీసుకుని తెరకెక్కించిన చిత్రమిది. మారుతి
తరహాలో వినోదాన్ని జోడిస్తూ కథను తయారు చేశాను. ఈ సినిమాతో ఓ మంచి
ప్రయత్నం చేశామని అందరూ ప్రశంసిస్తారనే నమ్మకం ఉంది. ఓ మంచి కథను
నిజాయితీగా తెరకెక్కంచాలని మేము కష్టపడ్డాం. ఇప్పటిదాకా నన్ను సాయి
రాజేష్‌ అంటారు గానీ నేను చేసిన సినిమాల పేర్లతో పిలవరు. కానీ ఈ సినిమా
విడుదలయ్యాక బేబీ దర్శకుడు అని పిలుస్తారు. నాకు కథ సరిగ్గా చెప్పడం
రాకున్నా హీరో ఆనంద్‌ దేవరకొండ స్క్రిప్ట్‍లోని సోల్‌ను నమ్మారు. నాకు
పూర్తి సహకారం అందించారు. మరో హీరో విరాజ్‌ అశ్విన్‌ కూడా ఏరోజూ
పట్టింపులకు పోకుండా బాగా సహకరించారు. బడ్జెట్‌ పెరుగుతున్నా, డేట్స్‍
పెరుగుతున్నా ఏ రోజూ నిర్మాత ఎస్కేఎన్‌ ఒత్తిడి చేయలేదు. వైష్ణవి ఈ
సినిమాలో చూపించిన పర్మార్మెన్స్‍ గురించి రేపు మీరంతా మాట్లాడుతారు.
మంచి చిత్రాన్ని త్వరలో మీ ముందుకు తీసుకురాబోతున్నాం. అన్నారు.

నిర్మాత ఎస్కేఎన్‌ మాట్లాడుతూ..నాకున్న పెద్ద సపోర్ట్‍ నా స్నేహితుడు
మారుతి. ఆయనా నేను కలిసి ఈ మాస్ మూవీ మేకర్స్‍ సంస్థను స్థాపించాం. యంగ్‌
టాలెంట్‌ను ప్రోత్సహించాలి, మంచి కథలను తెరపైకి తీసుకురావాలన్నది మా
సంస్థ ఉద్దేశం. మారుతి ఇప్పటిదాకా చేసిన సినిమాలు ఒక ఎత్తు, ఇకపై చేయబోయే
సినిమాలు మరో ఎత్తు. మా దృష్టిలో సినిమా అంటే అమ్మకం కాదు నమ్మకం. అలాంటి
నమ్మకంతోనే ఈ సినిమాను ఎక్కడా రాజీ పడకుండా నిర్మించాం. ఒక బ్యూటిఫుల్‌
లవ్‌ స్టోరిని ఈ చిత్రంలో చూస్తారు. ఆనంద్‌ ఈ సినిమాకు బ్యాక్‌ బోన్‌.
ఎంతో సపోర్ట్‍ చేసి సినిమా కంప్లీట్‌ చేశారు. విరాజ్‌ మరో హీరోగా బెస్ట్‍
పర్మార్మెన్స్‍ ఇచ్చారు. నాయిక వైష్ణవి ఈ కథకు ఆత్మలా నిలిచింది. ఆమె నట
ప్రతిభ మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ఆమెతో మూడు సినిమాలు చేయబోతున్నాం.
బేబీ మా సంస్థకు ఒక మైల్‌స్టోన్‌ అవుతుంది. మా కార్యక్రమానికి వచ్చిన
దర్శకులందరికీ కృతజ్ఞతలు. అన్నారు.


హీరో ఆనంద్‌ దేవరకొండ మాట్లాడుతూ...నేను కంటెంట్‌ ఓరియెంటెడ్‌,
సహజత్వానికి దగ్గరగా ఉండే చిత్రాలు చేస్తానని మిత్రులు చెబుతుంటారు. నా
కెరీర్‌లో సవాలు విసిరిన, సంతృప్తినిచ్చిన సినిమా ఇది. నేను చేసిన
మోస్ట్‍ కమర్షియల్‌ మూవీ కూడా ఇదే. ఏడాదిన్నర పాటు ఈ సినిమా కోసం ఇష్టంతో
కష్టపడ్డాను. వివిధ రకాలైన లుక్స్‍లో కనిపిస్తాను. నేనే కాదు మూవీ టీమ్‌
అంతా చాలా శ్రమించారు. నన్ను ఈ క్యారెక్టర్‌కు సెలెక్ట్‍ చేసుకున్న
దర్శకుడు సాయి రాజేష్‌కు థాంక్స్‍. దర్శకుడు మారుతి ఈ కథ విని బాగుంటుంది
చేద్దామన్నారు. ఆయన జడ్జిమెంట్‌ మీద కూడా మాకు నమ్మకం. ఈ కథలోని
ఎమోషన్స్‍ మీకు ఖచ్చితంగా కనెక్ట్‍ అవుతాయి. సినిమా కూడా నచ్చుతుంది.
అన్నారు.

హీరోయిన్‌ వైష్ణవి మాట్లాడుతూ...ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన
దర్శకుడు సాయి రాజేష్‌, నిర్మాత ఎస్కేఎన్‌, మారుతి గారికి థాంక్స్‍. నా
కెరీర్‌లో బెస్ట్‍ రోల్‌ ఈ సినిమాలో చేశాను. ఈ క్యారెక్టర్‌ నేను చేయగలను
అని నమ్మినందుకు సంతోషంగా ఉంది. బేబీ మీకొక బ్యూటిఫుల్‌ ఎమోషన్స్‍
అందిస్తుంది. అని చెప్పింది.

హీరో విరాజ్‌ అశ్విన్‌ మాట్లాడుతూ...బేబీ కథ చెప్పినప్పుడు అందులోని
ఎమోషన్స్‍కు బాగా కనెక్ట్‍ అయ్యాము. కథ ఎంత బాగా చెప్పారో అంతకంటే బాగా
దాన్ని తెరకెక్కించారు. మేమంతా ఇష్టపడి పనిచేశాం. మా చిత్రాన్ని తెరపై
ఎప్పుడెప్పుడు చూద్దామా అనేంత ఆసక్తిగా ఉన్నాము. ఆనంద్‌ తన
పర్మార్మెన్స్‍తో ఆకట్టుకుంటాడు. స్కూల్‌ బాయ్‌ లుక్స్‍లో సర్‌ప్రైజ్‌
చేశాడు. అన్నారు.

దర్శకుడు మారుతి మాట్లాడుతూ...ప్రేక్షకులందరికి నచ్చే కథ ఇది. మన
ఆడియెన్స్‍కు ఎలా చూపిస్తే బాగుంటుందో అలా తెరకెక్కించారు. ఆనంద్‌,
విరాజ్‌ ఇద్దరి నటన ఆకట్టుకునేలా ఉంటుంది. ఈ సినిమా మేము చూసుకున్నాక
చాలా సంతృప్తిగా అనిపించింది. బడ్జెట్‌కు రాజీ పడకుండా క్వాలిటీగా సినిమా
చేశాం. ఆర్థికంగా లెక్కలు వేసుకోకుండా చేసిన చిత్రమిది. మనపై వచ్చే
విమర్శలే గొప్ప చిత్రాలు చేసే స్ఫూర్తినిస్తాయి. సాయి రాజేష్‌ కూడా ఈ
సినిమాతో తనకున్న పేరు మరింత పెంచుకుంటాడు. అన్నారు.

దర్శకుడు వెంకటేష్‌ మహా మాట్లాడుతూ...ఎస్కేఎన్‌, మారుతి, ధీరజ్‌ ముగ్గురు
సినిమా పిచ్చివాళ్లు. ఆ ప్యాషన్‌తోనే ఈ సినిమాను రూపొందించారు. బేబీ ఒక
క్లాసిక్‌ మూవీగా మిగిలిపోవాలి. అన్నారు.

దర్శకుడు అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ...నేను ఏ సినిమా చేసినా సూపర్‌
హిట్‌ సినిమా చేశారనే ప్రశంసలు పంపిస్తున్నాడు ఎస్కేఎన్‌. మంచి సినిమా
చేయాలనే ప్యాషన్‌ ఉన్న టీమ్‌ అందరూ కలిస్తే ఎలాంటి ఔట్‌ పుట్‌ వస్తుందో
బేబీ సినిమా టీజర్‌ చూపించింది. ఆటోల వెనక ప్రేమ గురించి మంచి మంచి
కొటేషన్స్‍ రాస్తుంటారు. ఆ భాషలో తప్పులు ఉన్నా, భావం చాలా బాగుంటుంది.
అలాంటివి ఈ సినిమా టీజర్‌లో వాల్‌ మీద పెట్టారు. ఐడియా చాలా బాగుంది.
ఆనంద్‌ కెరీర్‌లో బేబీ ఓ మంచి సినిమాగా నిలిచిపోతుంది. టీమ్‌ అందరికీ
ఆల్‌ ద బెస్ట్‍. అన్నారు.

దర్శకుడు వశిష్ట మాట్లాడుతూ... ఈ సినిమా టీజర్‌ చూశాక నువ్వు నేను, జయం
లాంటి సినిమాలు చూసిన ఫీలింగ్‌ కలిగింది. సినిమా హిట్‌ అవ్వాలని
కోరుకుంటున్నాను. అన్నారు.

దర్శకుడు హరీశ్‌ శంకర్‌ మాట్లాడుతూ...మన ప్రేక్షకులు బాబలి చూస్తారు  భలే
భలే మగాడివోయ్‌ చూస్తారు. ఇక్కడ ఎవరి శుక్రవారం వారిదే. సాయి రాజేష్‌ ఈ
సినిమా తర్వాత ఫ్రమ్‌ ద డైరెక్టర్‌ ఆఫ్‌ బేబీ అని వేసుకోవచ్చు. ఒక
దర్శకుడికి మరో దర్శకుడు ప్రొడ్యూసర్‌గా ఉండి సినిమా ఇవ్వడం గ్రేట్‌.
మారుతి గారిని ఈ విషయంలో అప్రిషియేట్‌ చేయొచ్చు. టీజర్‌లో ఫీల్‌
కనిపించింది. ఆనంద్‌, విరాజ్‌, వైష్ణవి పర్మార్మెన్స్‍ బాగుంది. అన్నారు

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.