టాలీవుడ్ లో భారీ ఆఫర్ ను దక్కించుకున్న సోనాక్షి సిన్హా..!!

ప్రస్తుతం చిరంజీవి ఆచార్య సినిమా ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు.. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉండగా ఇప్పటికే వచ్చిన టీజర్ , ట్రయిలర్ లకు మంచి స్పందన వచ్చింది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా లో రామ్ చరణ్ తేజ్ మరో కీలక పాత్రలో నటిస్తుండగా అయన జోడిగా పూజ హెగ్డే నటిస్తుంది..

ఇకపోతే ఈ సినిమా తో పాటే చిరు రెండు రీమేక్ లలో నటిస్తున్నాడు.. ఒకటి మెహర్ రమేష్ దర్శకత్వంలోని వేదలమ్ రీమేక్ కాగా మరొకటి మోహన్ రాజా దర్శకత్వంలోని లూసిఫర్ రీమేక్.. ఆచార్య తరువాత ప్రాజెక్టుగా మలయాళ మూవీ 'లూసిఫర్' రీమేక్ పట్టాలెక్కుతుంది. ఈ సినిమా వెంటనే తమిళ హిట్ మూవీ 'వేదాళం' రీమేక్ సెట్స్ పైకి వెళుతుంది.

ఆ తరువాత సినిమాను బాబీ దర్శకత్వంలో చిరంజీవి చేయనున్నారు. అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో చిరంజీవి సరసన నాయికగా సోనాక్షి అయితే బాగుంటుందని భావించిన బాబీ, ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నాడని అంటున్నారు. దాదాపు ఆమెనే ఖరారు కావొచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.