
దేశంలో అతిపెద్ద రియాలిటీ షో లో గా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న బిగ్ బాస్ తెలుగులో విజయవంతంగా నాలుగు సీజన్ లు పూర్తి చేసుకుని ఐదో సీజన్ లోకి అడుగుతుంది..అయితే ఈ బిగ్ బాస్ లో పాల్గొన్న కంటస్టెంట్ లకు సినిమా ఆఫర్స్ రావడం అందరికి జరిగే విషయమే.. సినిమా ఆఫర్ లు, ఈవెంట్ లు, సీరియల్స్, ఇంకా ఏమైనా ఉంటె బిగ్ బాస్ లో వచ్చిన ఫేమ్ తో వచ్చేస్తాయి. అయితే బిగ్ బాస్ లో పాల్గొన్న ఏ కంటెస్టెంట్ కి బిగ్ బాస్ షో ని హోస్ట్ చేసేంత అవకాశం అయితే రాలేదు.. కానీ సీజన్ 4 లో అలరించిన సోహైల్ కి బిగ్ బాస్ షో ని హోస్ట్ చేసే అవకాశం లభించిందట.. వినడానికి ఇది కొంత వింతగా ఆశ్చర్యంగా గా ఉన్న ఇది మాత్రం ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది.

నిజమేనండీ. బిగ్ బాస్ షో బజ్ అనే ప్రోగ్రాం మా మ్యూజిక్ లో వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు తనీష్, రాహుల్ సిప్లిగంజ్ లు ఈ షో ని హోస్ట్ చేయగా త్వరలోమొదలవబోయే షో కి సోహైల్ హోస్ట్ గా చేయనున్నాడట.. జూన్ లో ప్రారంభమయ్యే ఈ షో కి బిగ్ బాస్ యూనిట్ గతంలో ఎన్నడూ రానివిధంగా ఉండేందుకు ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే పార్టిసిపెంట్స్ ని కూడా సెలెక్ట్ చేసింది.. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉన్నవారిని వడపోసింది.. త్వరలోనే లిస్ట్ ను కూడా రిలీజ్ చేయనుంది..

ఇక సోహైల్ యాంగ్రీ యంగ్ మ్యాన్ గా బిగ్ బాస్ లో అలరించి మెగా స్టార్ పొగడ్తను అందుకున్నాడు.. అంతేకాదు ఆయననే తన సినిమాల్లో నటింపచేసే ఛాన్స్ కొట్టేశాడు. బిగ్ బాస్ సీజన్ ఫినాలే లో చిరంజీవి ప్రకటించిన వరాల్లో సోహైల్ కే ఎక్కువ వరాలు పొందాడని చెప్పొచ్చు.. ఇక ఫినాలే లో అతను 25 లక్షల క్యాష్ తో బయటకి వచ్చి సంచలనం సృష్టించాడని చెప్పొచ్చు.. ఏదైతేనేం సీజన్ 4 కంటెస్టెంట్ లను మిస్ అవుతున్నామని ఫీల్ అవుతున్న అభిమానులకు సోహైల్ ఈవిధంగా వారి కోరికను నెరవేర్చుతున్నాడు.