ప్రియదర్శి @ ‘రాధే శ్యామ్’ సెట్

రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తోన్న సినిమా రాధే శ్యామ్. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. శరవేగంగా సాగుతోన్న ఈ షూటింగ్ త్వరలోనే పూర్తి కానుంది. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను రాధా కృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్నాడు. ఇక రాధే శ్యామ్ లో ప్రముఖ కమెడియన్ ప్రియదర్శి కీలక పాత్రలో కనిపించనున్నాడు. హీరో ఫ్రెండ్ పాత్రను ప్రియదర్శి పోషిస్తున్నాడు. ఇక ఈ సినిమా సెట్స్ నుండి ప్రియదర్శి పోస్ట్ చేసిన ఫోటో వైరల్ అవుతోంది. "ఫిజిక్స్ కు లైట్ కు మధ్య పెళ్ళితో రాధే శ్యామ్ ప్రేమ కథ మరింత అందంగా తయారైంది" అంటూ ప్రియదర్శి ఈ సినిమా కోసం వాడిన లైటింగ్ టెక్నిక్ ను పోస్ట్ చేసాడు. మా మాంత్రికుడు మనోజ్ కు హ్యాట్సాఫ్ అని రాసాడు. మనోజ్ పరమహంస రాధే శ్యామ్ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో షూటింగ్ సమయంలో వాడిన భిన్నమైన లైటింగ్ కు ప్రియదర్శి ఇలా స్పందించాడు అన్నమాట. వచ్చే ఏడాది మొదటి హాఫ్ లో రాధే శ్యామ్ విడుదల కానుంది.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.