గాయకుడు శ్రీ కె.కె. గారు అకాల మరణం బాధాకరం -----పవన్ కళ్యాణ్!!

Subject: గాయకుడు శ్రీ కె.కె. గారు అకాల మరణం బాధాకరం

గాయకుడు శ్రీ కె.కె. గారు అకాల మరణం బాధాకరం

కె.కె.గా సుపరిచితులైన ప్రముఖ గాయకుడు శ్రీ కృష్ణకుమార్ కున్నత్ గారి అకాల మరణం బాధ కలిగించింది. సినీ సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక బాణీని కలిగిన గాయకుడు శ్రీ కె.కె. గారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. నా చిత్రాల్లో ఆయన ఆలపించిన గీతాలు అభిమానులను, సంగీత ప్రియులను అమితంగా మెప్పించాయి. ఖుషీ చిత్రం కోసం ‘ఏ మేరా జహా’ గీతం అన్ని వయసులవారికీ చేరువైంది. అందుకు శ్రీ కె.కె. గారి గాత్రం ఓ ప్రధాన కారణం. ‘జల్సా’లో మై హార్ట్ ఈజ్ బీటింగ్... అదోలా’, ‘బాలు’ ‘ఇంతే ఇంతింతే’, ‘జానీ’లో ‘నాలో నువ్వొక సగమై’, ‘గుడుంబా శంకర్’లో ‘లే లే లే లే’.. గీతాలను నా చిత్రాల్లో ఆయన పాడారు. అవన్నీ శ్రోతలను ఆకట్టుకోవడమే కాదు... సంగీతాభిమానులు హమ్ చేసుకొనేలా సుస్థిరంగా నిలిచాయి. సంగీత కచేరీ ముగించుకొన్న కొద్దిసేపటికే హఠాన్మరణం చెందటం దిగ్భ్రాంతికరం. ఆయన చివరి శ్వాస వరకూ పాడుతూనే ఉన్నారు. శ్రీ కె.కె. గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఆ కుటుంబానికి భగవంతుడు మనో ధైర్యాన్ని ప్రసాదించాలి.

(పవన్ కళ్యాణ్)

Sudden demise of singer Sri KK is painful
The sudden demise of noted singer Sri Krishnakumar Kunnath who is popularly known as KK has pained me immensely. Sri KK is a singer having a special style of singing in the cine music world and I pray the God his soul may rest in peace. The songs he had sung in my films impressed fans and music lovers greatly. The song “Ye Mera Jahan” song in Khushi film has reached people of all ages. The voice of Sri KK is the reason for its success. He had sung in my films “My heart is beating..Adola” in ‘Jalsa’ movie, “Inthe inthinthe” in ‘Balu’, “Naalo nuvvu sagamai” in ‘Johnny’ and “Le le le le” in ‘Gundumba Shankar’. All these songs not only attracted the audience but also occupied a top-notch making the music lovers to do humming forever. Shockingly, he died just after he completed a musical concert. He has been singing till his last breath. I offer my deep condolences to the bereaved family members of Sri KK. Only God may endow psychological courage to the family.

(Pawan Kalyan)

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.