ప్రముఖ నిర్మాత విష్ణు వర్ధన్ ఇందూరి నిర్మాణంలో బోరియా మజుందార్ రచించిన 'మావెరిక్ కమీషనర్: ది ఐపీఎల్–లలిత్ మోడీ సాగా' పుస్తకం ఆధారంగా భారీ చిత్రం!!

ప్రముఖ నిర్మాత విష్ణు వర్ధన్ ఇందూరి నిర్మాణంలో బోరియా మజుందార్ రచించిన 'మావెరిక్ కమీషనర్: ది ఐపీఎల్–లలిత్ మోడీ సాగా' పుస్తకం ఆధారంగా సినిమా రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. సైమన్ & షుస్టర్ ఇండియా మే 20న  ''మావెరిక్ కమీషనర్: ది ఐపీఎల్- లలిత్ మోడీ సాగా' పుస్తకాన్ని ప్రచిరిస్తున్నట్లు వెల్లడించింది. ఈ పుస్తకం ఆధారంగా తలైవి, 83 సూపర్ హిట్ చిత్రాల నిర్మాత విష్ణు వర్ధన్ ఇందూరి భారీ సినిమాని తెరకెక్కించనున్నారు.

నిర్మాత విష్ణు వర్ధన్ ఇందూరి మాట్లాడుతూ.“1983 ప్రపంచకప్ గెలవడం ఒక గొప్ప చరిత్ర. భారత్ క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తుందని  కొన్ని సంవత్సరాల కింద ప్రపంచంలో ఎవరూ నమ్మలేదు. దాదాపు పాతికేళ్ళ తర్వాత  క్రికెట్‌లో మరో మైలురాయిగా ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్-ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఏర్పాటైయింది. ఇది క్రికెట్ ప్రపంచాన్ని మార్చేసింది. ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్ట్ బోరియా మజుందార్ రచించిన ''మావెరిక్ కమీషనర్: ది ఐపిఎల్ - లలిత్ మోడీ సాగా' పుస్తకం ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్  ఐపిఎల్‌, దాని వెనుక వున్న వ్యక్తి-లలిత్ మోడీ గురించి అనేక ఆసక్తికరమైన విషయాలు ఈపుస్తకంలో పొందుపరిచారు. ఈ అద్భుతమైన పుస్తకాన్ని ఫీచర్ ఫిల్మ్‌గా మారుస్తున్నామని ప్రకటిస్తున్నందుకు సంతోషిస్తున్నాను'' అని వెల్లడించారు.

రచయిత, జర్నలిస్ట్, బోరియా మజుందార్ మాట్లాడుతూ.. "ఐపీఎల్ విజయం గత దశాబ్దంన్నర కాలంలో భారత క్రికెట్ కు గొప్ప సహకారం. ఈ విజయం అంత తేలికగా రాలేదు. ఐపీయల్ కమీషనర్ లలిత్ మోడీ... విజనరీ ఐడియా. దీనిని మొదలుపెట్టాలనుకున్నప్పుడుమోడి దగ్గర ఒక విజనరీ ఐడియా తప్పా ఇంకేమీ లేదు. ఐపీఎల్ ఎలా మొదలైయింది? దీని వెనుక కథలు ఏమిటి? తెరవెనుక ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇవన్నీ లలిత్ మోడీ మెడకు ఎలా చుట్టుకున్నాయి? ఏళ్ల పరిశోధన, వందలాది ఇంటర్వ్యూలు.. ఫలితంగా ఈ పుస్తకం వెలువడుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. సినిమాగా తెరకెక్కబోతున్న నా మొదటి పుస్తకం ఇదే కావడం మరింత ఆనందంగా వుంది. పాఠకులు ఈ అన్‌టోల్డ్ స్టోరీని చదివి ఆనందిస్తారని ఆశిస్తున్నాను'' అని పేర్కొన్నారు

సైమన్ & షుస్టర్ ఇండియా ఎండీ రాహుల్ శ్రీవాస్తవ మాట్లాడుతూ..  “మీరు క్రికెట్ అభిమాని అయితే ఐపియల్, లలిత్ మోడీ గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నారు. అసలు అదంతా ఎలా జరిగింది? తర్వాత ఏం తప్పు జరిగింది?  ఆ సమయంలో జరిగిన ప్రతి అసాధారణమైన సంఘటనలు మునుపెన్నడూ లేని కథగా ఎలా మారింది?. సైమన్ & షుస్టర్ ఇండియాలో ''మావెరిక్ కమీషనర్: ఐపీయల్– లలిత్ మోడీ సాగా'ను ప్రచురించడం, రచయిత బోరియాతో మా అనుబంధాన్ని కొనసాగించడం పట్ల మేము ఎంతో సంతోషిస్తున్నాము. ఈ పుస్తకాన్ని త్వరలో ఫీచర్ ఫిల్మ్‌గా వస్తుంది' అని అన్నారు.



పుస్తకం గురించి:
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులందరి ద్రుష్టిని ఆకర్షించింది. ప్రపంచ క్రికెట్ లో కాలక్రమేణా మరింత బలంగా పెరిగింది. 2008లో లలిత్ మోడీచే రూపొందించబడి, నిర్వహించబడిన ఐపీయల్.. క్రికెట్ మార్కెట్ తోపాటు క్రికెట్ ప్రపంచంతో విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది.  మోడీ తన సొంత నిబంధనల ప్రకారం టోర్నమెంట్‌ను రూపొందించి, నిర్వహించిన ఐపీయల్ అద్భుతమైన విజయం తర్వాత.. అవే నియమాలను పాలక వర్గాలు ప్రశ్నించాయి. ఆ తర్వాత మోదీపై జీవితకాల నిషేధం విధించాయి.  
అసలు ఎందుకిలా జరిగింది? తెరవెనుక ఏం జరిగింది? మోడీ, ఇతరుల మధ్య ప్రతికూల పరిస్థితులు ఎలా మొదలయ్యాయి ? ఐపీయల్ చరిత్రలో ఎప్పటికీ బయటకు రాని రహస్యాలు ఉన్నాయా? ఈ పుస్తకంలో మీకు ఇప్పటివరకూ తెలియని నిజాలు వుంటాయి. నాటి సంఘటనల్లో కీలకంగా వ్యవహరించిన వ్యక్తుల ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇందులో వాస్తవాలని దృవీకరించడం జరిగింది. మావెరిక్ కమీషనర్ పుస్తకం ఐపీయల్ వ్యవస్థాపకుడు లలిత్ కుమార్ మోడీ తీరుతెన్నులకు సంబధించిన ఆసక్తికమైన సమాహారం.

ఈ పుస్తకం ఆధారంగా విష్ణు ఇందూరి విబ్రి మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై మావెరిక్ కమీషనర్ లోని సంఘటనలని యధార్ధంగా చిత్రీకరీంచనున్నారు. ఇందులో అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. లలిత్ మోడి తప్పా ఒప్పా అని ఇందులో చెప్పడం లేదు. ఇది ఆయన కథని మాత్రమే చెబుతుంది. అసలు లలిత్ మోడీ ఎవరు ? పాఠకులే నిర్ణయించాలి.

రచయిత గురించి:

బోరియా మజుందార్ సుప్రసిద్ధ స్కాలర్. దేశంలోని అత్యంత ప్రభావవంతమైన వ్యాఖ్యాతలలో ఒకరిగా గుర్తింపు పొందారు. 2002, 2022 మధ్య అంతర్జాతీయ స్పోర్ట్స్ కవర్ చేసిన బోరియా పలు క్రీడలు, పలు-భాషల డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ''RevSportz'' వ్యవస్థాపకులు.
మజుందార్ గత 20 సంవత్సరాలుగా స్పోర్ట్స్ పై 1,500 కంటే ఎక్కువ కాలమ్‌లు రాశారు.  ఎలెవెన్ గాడ్స్ అండ్ ఎ బిలియన్ ఇండియన్స్, ఒలింపిక్స్: ది ఇండియా స్టోరీ (విత్ నలిన్ మెహతా), ప్లేయింగ్ ఇట్ మై వే- సచిన్  టెండూల్కర్ ఆత్మకథ సహా పలు పుస్తకాలకు రచయిత, సహ రచయితగా ఉన్నారు. ఆయన షో 'బ్యాక్‌స్టేజ్ విత్ బోరియా' దేశంలో అత్యధికంగా వీక్షింపబడిన స్పోర్ట్స్ చాట్ షోలలో ఒకటిగా నిలిచింది.

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.