
భలే మంచి రోజు,ఆనందో బ్రహ్మ, యాత్ర, మొదలగు డీఫ్రెంట్ ఫిలిమ్స్ నిర్మిస్తూ ప్రేక్షకాదరణ పొందుతున్నారు. ఇంతవరకు రానటువంటి కొత్త కాన్సెప్ట్ "శ్రీదేవి సోడా సెంటర్" తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి. 70mm ఎంటర్టైన్మెంట్ పతాకంపై సుధీర్ బాబు, ఆనంది జంటగా పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. స్వర మాంత్రికుడు మణిశర్మ సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 27 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతున్న సందర్భంగా విలేకర్లతో నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి లు మాట్లాడుతూ
ఈ సినిమాకు మహేష్ బాబు , ప్రభాస్ , చిరంజీవి గారూ సపోర్ట్ చేసినందుకు వారికి మా ధన్యవాదాలు.. చిరంజీవి గారు మా ప్రతి సినిమాకి సపోర్ట్ చేస్తున్నారు ఆయన సపోర్ట్ నాకు ఎప్పటికీ ఉంటుంది. మేము మంచి కథలు కోసం చూస్తున్నాం.ఇప్పుడు ఒక స్క్రిప్టు రెడీ అవుతుంది అది ఇంకా ఫైనల్ కాలేదు. వైయస్ జగన్ గారి బయోపిక్ కథ మాకు ఎవరూ చెప్పలేదు . ఏ డైరెక్టర్ తో కూడా చేస్తామని ఆఫీసియల్ గా స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. అలాగే పెద్ద హీరోలతో మేము సినిమా చేయడానికి సిద్దంగా ఉన్నాము ..కానీ మా కథ ఆ హీరోలకు నచ్చాలి వారికి మా కథ నచ్చితే మేము సినిమా చేస్తాము.

సెకండ్ వేవ్ తర్వాత వస్తున్న బిగ్గెస్ట్ థియేటర్ రిలీజ్ మూవీ మా "శ్రీదేవి సోడా సెంటర్". సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, బ్రిడ్జ్ ఎంటర్టైన్మెంట్స్ లక్ష్మణ్ గారి సపోర్ట్ తో ఆంధ్ర, తెలంగాణ లలో సుమారు 500 థియేటర్స్ లలో ఈ సినిమాను విడుదల చేస్తున్నాము.ఇవి కాక ఇంకా అమెరికా లో 120 థియేటర్స్ లో, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్ ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాము. ఫ్యామిలీస్ కావచ్చు ఇంకెవరైనా కూడా 20 మెంబర్స్ కలసి టికెట్స్ బుక్ చేసుకుంటే షో వేస్తాము. యూఎస్ లో మేము ఇలాంటి కొత్త కల్చర్ ను అలవాటు చేస్తున్నాం.