From the sets of #RadheShyam
— BARaju (@baraju_SuperHit) November 19, 2020
Rebel Star #Prabhas @hegdepooja @director_radhaa @UV_Creations @justin_tunes @GopiKrishnaMvs pic.twitter.com/ABgrXQvWSR
రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తోన్న చిత్రం రాధే శ్యామ్. రొమాంటిక్ ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. అయితే రాధే శ్యామ్ షూటింగ్ లో ఒక చిన్న వీడియోని డైరెక్టర్ రాధ కృష్ణ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసారు. తన సినిమాటోగ్రాఫర్ తో కలిసి బ్లూ స్క్రీన్ లో షూట్ చేస్తున్నాం అని ఆయన పోస్ట్ లో చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న ఈ షూటింగ్ త్వరలోనే పూర్తి కాబోతుంది. ఈ మూవీలో విక్రమాదిత్యగా ప్రభాస్ కనిపించనుండగా పూజా ప్రేరణగా నటిస్తున్నారు. భాగ్యశ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ భారీ బడ్జెట్ సినిమాలనే చేస్తున్నారు. ఈ రాధే శ్యామ్ కూడా చాలా పెద్ద బడ్జెట్తో నిర్మితమవుతోంది. ఈ సినిమా దాదాపుగా ఏడు భాషలలో వచ్చే సంవత్సరం విడుదల కాబోతుంది. ఈ సినిమాతో ప్రభాస్ ఎన్ని రికార్డ్స్ సృష్టిస్తారో వచ్చే సంవత్సరం వరకు చూడాలి. ఈ మధ్యనే విడుదలైన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ వీడియోకి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.యూట్యూబ్ లో ఈ వీడియో కి 25 మిలియన్ వ్యూస్ తో రికార్డ్ సృష్టించింది.